Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » కొత్త కారు కొన్న సచిన్..ఎన్ని కోట్లు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..?

కొత్త కారు కొన్న సచిన్..ఎన్ని కోట్లు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..?

by Sravanthi Pandrala Pandrala
Ads

సాధారణంగా హీరోలంటే కొన్ని రాష్ట్రాలకే పరిమితమై ఉంటారు.. కేవలం స్క్రీన్ పైన మాత్రమే నటిస్తూ ఉంటారు.. కానీ స్పోర్ట్స్ స్టార్స్ అంటే ప్రపంచమంతా గుర్తిస్తారు. అలా క్రికెట్ స్టార్ దేవుడిగా గుర్తింపు పొందిన స్టార్ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ అంటే ఇండియాలోనే కాదు ప్రపంచంలో క్రికెట్ ఉన్న ప్రతి ఒక్క దగ్గర ఈయనకు ప్రత్యేకమైనటువంటి క్రేజ్ ఉంటుంది. క్రికెట్ ఆడి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సచిన్ టెండూల్కర్ కు కార్లు అంటే చాలా ఇష్టం అంట.

Advertisement

Ad

ఇప్పటికే ఆయన గ్యారేజీలో ఎంతో విలువైన కార్లు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లోకి ఎలాంటి కొత్త కారు వచ్చిన ఆయన తప్పకుండా కొనుగోలు చేస్తారు. అయితే తాజాగా ఆయన కార్లలోనే టాప్ వేరియంట్ అయిన లంబోర్గిని ఉరుస్ ఎస్ ఎగ్జరీ కారును కొన్నారట. దీని ధర రూ.4.18 కోట్లు. ఈ కారు ఉరుసు లైన్ అప్ లో వచ్చినటువంటి రెండవ మోడల్. ఇది ఉరుస్ పెర్ఫార్మెంటు కంటే కాస్త తక్కువ ధర. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన వీడియోను ఒక యూట్యూబ్ ఛానల్ షేర్ చేసింది.

Advertisement

2012లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఆయన బిఎండబ్ల్యూకు సచిన్ టెండూల్కర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విషయం మనందరికీ తెలుసు. అలాంటి సచిన్ తన కెరియర్ లో ముందుగా కొనుగోలు చేసిన కారు మారుతీ 800.. ఆ కార్ అంటే ఇప్పటికి తనకి ఎంతో ఇష్టమట. తన కారు ప్రయాణం మొదటిసారిగా అందులోనే చేయడంతో దాన్ని ఇప్పటికీ కంటికి రెప్పలా చూసుకుంటారట. ఇప్పటికీ ఆయన గ్యారేజీలో ఈ కారు ప్రత్యేక ఆకర్షణగా ఉంది.

మరికొన్ని ముఖ్య వార్తలు :

Visitors Are Also Reading