Home » మహేష్ సినిమా ఎంట్రీ వెనుక దాగి ఉన్న కథ గురించి మీకు తెలుసా ?

మహేష్ సినిమా ఎంట్రీ వెనుక దాగి ఉన్న కథ గురించి మీకు తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ సీనియర్ హీరో, స్వర్గీయ కృష్ణ నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు మహేష్ బాబు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ గా  వెలుగొందుతున్నాడు. టాలీవుడ్ లో ప్రస్తుతం అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే నటుల లిస్టులో మహేష్ బాబు కూడా ముందుంటాడు. ఓవైపు హీరోగా  మరోవైపు నిర్మాతగా అగ్రస్థానంలో కొనసాగుతున్న మహేష్ బాబు సినీ రంగ ప్రవేశం ఆయనకు తెలియకుండానే జరిగిపోయిందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

Advertisement

1975 ఆగస్టు 9న చెన్నైలో జన్మించిన మహేష్ బాబు ఆరేళ్ల వయస్సులో తన అన్నయ్య రమేష్ తో కలిసి విజయవాడకి వెళ్లాడు. మహేష్ పుట్టే నాటికి సూపర్ స్టార్ కృష్ణ 100 సినిమాలకు పైగా నటించి అగ్ర హీరోగా చలామణి అవుతున్నారు. సరిగ్గా అదే సమయంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో రమేష్ నీడ అనే సినిమా చేస్తున్నాడు. అందులో కీలకమైన బాల నటుడి పాత్ర ఉండటంతో మహేష్ బాబు బాగుంటారని దాసరి అనుకున్నారట. అయితే ఈ విషయం మహేష్ కి చెప్పకుండా, అతనికి తెలియకుండా షూట్ చేశాడు దాసరి. దీంతో నీడ సినిమా ద్వారా తనకు తెలియకుండానే సినీ రంగ ప్రవేశం జరిగిపోయింది.

Advertisement

 ఇక ఆ తర్వాత సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. మహేష్ బాల నటుడిగా అనేక సినిమాలలో నటించి మెప్పించాడు. ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరించిన రాజకుమారుడు సినిమా ద్వారా మహేష్ బాబు హీరోగా రీఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ సినిమా తర్వాత మహేష్ తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు చేసింది 27 సినిమాలే అయినప్పటికీ కానీ 8 నంది అవార్డ్స్ సొంతం చేసుకున్న ఏకైక హీరో మహేష్ బాబు. రాజకుమారుడు సినిమాకు తొలి నంది అవార్డు అందుకున్న మహేష్ బాబు ఆ తర్వాత అనేక సినిమాలకు నందులు అందుకున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న మహేష్ బాబు ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో గ్లోబల్ మూవీ  చేయబోతున్నాడు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

బాహుబలిలో నటించడానికి రమ్యకృష్ణ అన్ని షరతులు పెట్టారా? వీటికి రాజమౌళి ఓకే చెప్పారా?

మహేష్ బాబు ఏ ఇతర హీరో సినిమా ఈవెంట్స్ కి ఎందుకు వెళ్ళరో తెలుసా…?

Visitors Are Also Reading