Home » పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

by Anji
Ad

సినీ ఇండస్ట్రీలో సాధారణంగా ఒక హీరో చేయాలనుకునే సినిమాలు మరో హీరో చేయడం సర్వసాధారణం. అలా చాలా సినిమాలను చాలా హీరోలు మిస్ చేసుకున్నారు. అందులో కొన్ని సినిమాలు సక్సెస్ సాధిస్తే.. మరికొన్ని సినిమాలు ఫెయిల్యూర్ అయ్యాయి. ముఖ్యంగా ఒక హీరో వదులుకున్న సినిమా మరో హీరోకు లక్కీ ఛాన్స్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అనుకోకుండా కొంతమంది అగ్రహీరోలు వదులుకున్న సినిమాలు మరో యంగ్ స్టర్స్ కి స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి.

Also Read :   హరికృష్ణ గారు ఆ రెండుళ్లు ఎన్టీఆర్ తో ఎందుకు దూరంగా ఉన్నారు ?

Advertisement

అలాంటి వాటిలో బద్రి సినిమా ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి స్టార్ ఇమేజ్ తెచ్చి పెట్టిన చిత్రం బద్రి. ఏప్రిల్ 20, 2000లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించింది.  విజయలక్ష్మీ మూవీస్ బ్యాన్ పై టి.త్రివిక్రమ్ నిర్మించిన ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతోనే పూరి వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యారు. అప్పటివరకు ఉన్న మాస్ ఫార్మాలాకి స్వస్తి చెప్పి సరికొత్త హీరోయిజాన్ని పరిచయం చేశాడు పూరి జగన్నాథ్. నువ్వు నంద అయితే నేను బద్రి బద్రినాథ్ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ అప్పట్లో అభిమానులకు పూనకాలు తెప్పించాయనే చెప్పాలి.

Advertisement

Also Read :  ప‌వన్ ఫ్యాన్స్ వ‌ర్సెస్ రేణూదేశాయ్…ఎవ‌రికోస‌మో నేను మారాలా అంటూ మ‌రోసారి ఫైర్..!

ఇందులో విలన్ క్యారెక్టర్ ప్లే చేసిన ప్రకాశ్ రాజ్ కి కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఇందులో నంద పాత్రలో నటించిన ఆయనకు ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. ఇంత పెద్ద సక్సెస్ అందుకున్న ఈ చిత్రానికి పవర్ స్టార్ ఫస్ట్ ఛాయిస్ కాదు.. ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చేసింది ఈ కథ. రిజెక్ట్ చేసింది మరెవ్వరో కాదు.. అక్కినేని నాగార్జున. పూరి జగన్నాథ్ తొలుత నాగార్జునకే ఈ కథను చెప్పారట. కానీ డేట్స్ కుదరకపోవడంతో మూవీకి నో చెప్పారట నాగార్జున. దీంతో ఈ కథ పవన్ వద్దకు వెళ్లింది. అలా పవన్ కళ్యాణ్ ఖాతాలో ఓ హిట్ పడింది.

Also Read :  నందమూరి వారసుడే అయినా కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ లా ఎందుకు స్టార్ అవ్వలేకపోయారు…? 5 కారణాలు ఇవేనా..!

Visitors Are Also Reading