Home » నేలపై కూర్చోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?

నేలపై కూర్చోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

పూర్వకాలంలో ఎవరింట్లో చూసినా కుర్చీలు, సోఫాలు ఉండేవి కావు. కేవలం నేలపైనే కూర్చునేవారు. ఎవరో ధనవంతుడు ఇంట్లో చెక్క కుర్చీలు ఉండేవి. కానీ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో మెత్తని సోపాలు అందుబాటులో ఉంటున్నాయి. చాలామంది ఈ సోఫాల్లోనే వారి సగం జీవితాన్ని గడిపేస్తున్నారు. లాప్టాప్ లో వర్క్ చేసిన, టీవీ చూసినా, భోజనం చేసినా, ఇంట్లో ఏ పని చేసిన దానిపైన కూర్చొని చేస్తూ ఉంటారు. కనీసం శరీరానికి కొంత కూడా ఇబ్బంది కలిగించరు చెమటోర్చరు.

also read:బాలీవుడ్ లో తొలి సినిమాకే ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

Advertisement

also read:పెళ్లయిన తర్వాత కూడా మీ ఎక్స్ కల్లోకి వస్తున్నారా..అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..?

Advertisement

ఏది కావాలన్నా కనీసం నిలబడకుండా ముందుకు తెప్పించుకుంటున్నారు. ఇలాంటి ఈ తరుణంలో శరీరానికి పని లేకపోవడం చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ పూర్వకాలంలో ఇవేవీ ఉండేవి కాదు. నేలపై కూర్చొని ఎంతసేపైనా నిటారుగా ఉండేవారు. నేలపై కూర్చుని ఆహారం తీసుకునేవారు. అందుకే వారి ఆయుః ప్రమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి నేలపై కూర్చుంటే ఎన్ని లాభాలో చూద్దామా.. ముఖ్యంగా వెన్నునొప్పితో బాధపడేవారు నేలపై కూర్చోవడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది.

వెన్నెముక నిటారుగా అవుతుంది. వెన్ను సమస్య పోతుంది. కాబట్టి వెన్ను నొప్పితో బాధపడేవారు నేలపై కూర్చోవడానికి ప్రయత్నించండి. అలాగే మైండ్ ఒత్తిడికి గురైనప్పుడు నేలపై కూర్చొని తినడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మెదడు చాలా యాక్టివ్ గా ఉంటుందట. అలాగే ఆహారం తీసుకునే ముందు నేల పై కూర్చొని తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.

also read:

Visitors Are Also Reading