Home » మహేష్ బాబును ఎదురించిన ‘శుభోదయం సుబ్బారావు’ బ్యాక్ గ్రౌండ్ ఎంటో తెలుసా?

మహేష్ బాబును ఎదురించిన ‘శుభోదయం సుబ్బారావు’ బ్యాక్ గ్రౌండ్ ఎంటో తెలుసా?

by Bunty
Ad

 

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చిన మహేష్ బాబు మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

Advertisement

అయితే ప్రిన్స్ మహేష్ బాబు కెరీర్ లో…. భరత్ అనే నేను సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు. 2018 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు సీఎం పాత్రలో కనిపించి అందరినీ కనువిందు చేశాడు. అయితే సినిమాలో భాగంగా మహేష్ బాబు ప్రెస్ మీట్ నిర్వహిస్తాడు. అయితే ఆ ప్రెస్ మీట్ లో మహేష్ బాబు పై ఓ విలేఖరి వ్యంగ్యంగా ప్రశ్నలు అడుగుతాడు. ఈ సినిమాలో ఆ వ్యక్తి పాత్ర పేరు శుభోదయం సుబ్బారావు.

Advertisement

అయితే ఈ శుభోదయం సుబ్బారావు పాత్ర చేసిన వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాలో శుభోదయం సుబ్బారావు పాత్రలో చేసిన యాక్టర్ పేరు రాజశేఖర్ అంగోని. రాజశేఖర్ 2014 సంవత్సరంలోనే షురూ యాత్ యా ఇంటర్వెల్ అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. అలాగే తెలుగులో గోవిందుడు అందరివాడెలే, బాహుబలి ది బిగినింగ్, అరవింద సమేత ఇలాంటి ఎన్నో మంచి సినిమాలు చేశారు రాజశేఖర్. ఇక ఇటీవల రుద్రమాంబ పురం అనే సినిమాలో కూడా ఈయన నటించారు. భరత్ అనే నేను సినిమాలో పాత్ర చేసిన తర్వాత ఈయనకు శుభోదయం సుబ్బారావు అని పేరు వచ్చింది.

ఇవి కూడా చదవండి

ప్రభాస్, అనుష్క ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇన్నాళ్లకు ఆ ముచ్చట తీరనుంది..!

“నువ్వు నా కెరీర్ ముగించావు” విరాట్ కోహ్లీపై జహీర్ ఖాన్ సంచలనం !

హర్మన్‌ప్రీత్‌ను తప్పుబట్టిన అఫ్రిది..ట్రోలింగ్ చేస్తున్న ఇండియన్స్ !

Visitors Are Also Reading