Home » బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య బ్యాక్ గ్రౌండ్ గురించి మీకు తెలుసా ?

బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య బ్యాక్ గ్రౌండ్ గురించి మీకు తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా ప్రస్తుతం సినిమాల పరిస్థితి ఎలా ఉందంటే.. కథ బాగుంటేనే జనాలు థియేటర్ల వైపు అడుగు వేస్తున్నారు. ఎంత భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు తీసినప్పటికీ కథ, సినిమా పాజిటివ్ టాక్ రాకుంటే థియేటర్ల వద్దకు కాలు కదపడం లేదు. తాజాగా విడుదలైన బేబీ మూవీ పాజిటివ్ టాక్ రావడంతో రెండు రోజుల నుంచి థియేటర్ల వైపు పరుగులు పెడుతున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. బేబీ మూవీలో హీరోయిన్ గా చేసినటువంటి తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య భుజాలపై మోసిందనే చెప్పవచ్చు. రకరకాల వేరియేషన్స్ లో అదురగొట్టిన వైష్ణవి చైతన్య పాతబస్తీకి చెందిన అమ్మాయి. ఆమె సంపన్న కుటుంబం ఏమి కాదు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది వైష్ణవి చైతన్య. బేబీ మూవీతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె గురించి ఇప్పుడు పలు ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. 

Advertisement

ఆనంద్ దేవరకొండ హీరోగా.. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా ప్రేమ కథగా చేసుకొని సాయి రాజేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ బేబీ. ఈ చిత్రంలో ఓలవర్ గా కాలేజ్ స్టూడెంట్ రకరకాల వేరియేషన్స్ లో వైష్ణవి చైతన్య అద్భుతంగా నటించింది. ఈ మూవీ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. అలాంటి వైష్ణవి చైతన్య ఎవరు ? ఎక్కడి నుంచి వచ్చింది. బేబీ మూవీ వరకు రావడానికి ఎలాంటి కష్టం పడిందంటే..? వైష్ణవి చైతన్యది హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ. చిన్నప్పటి నుంచే ఆమెకు సినిమాలంటే చాలా పిచ్చి. ఇండస్ట్రీలోకి రాకముందు కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంది. ఆమె స్టేజ్ షోలు కూడా ఇచ్చింది. ఇంట్లోని అద్దం ముందు తనకు తాను చూసుకుంటూ నటించేదట.

Advertisement

ఈ తరుణంలో వైష్ణవి తల్లి నువ్వు బాగా నటిస్తావు. సినిమాలో హీరోయిన్ అవుతావా ఏంటి అన్నదట. ఆమె ఏ సందర్భంలో అన్నదో ఏమో కానీ.. బేబీ మూవీ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇండస్ట్రీలో ఛాన్స్ కోసం దాదాపు ఎనిమిదేళ్ల పాటు తిరిగిందట. ఎనిమిదేళ్ల సినీ కెరీర్ లో యూట్యూబ్ ఛానల్స్, షార్ట్ ఫిలింస్, టిక్ టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫారం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తరువాత బేబీ మూవీ ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకొని అక్కడికి వెళ్లి తన టాలెంట్ నిరూపించుకుంది. హీరోయిన్ గా సెలెక్ట్ అయిపోయింది. దీనికంటే ముందు ఆమె చాలా సినిమాలకు తన తండ్రితో కలిసి బైకుపై ఆడిషన్స్ కి వెళ్లేదట. పేద మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య ఇండస్ట్రీలో మంచి స్థాయికి చేరుకోవాలని మనందరం కోరుకుందాం. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

సూపర్ స్టార్ కృష్ణకి ఎస్వీ రంగారావుకి మధ్య జరిగిన ఛాలెంజ్ గురించి మీకు తెలుసా ?

 Mahesh Babu : మహేష్ -రాజమౌళి సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ?

పవన్ కళ్యాణ్ ఆదేశం.. రాజకీయాల్లోకి సాయిధరమ్ తేజ ?

Visitors Are Also Reading