Home » సూపర్ స్టార్ కృష్ణకి ఎస్వీ రంగారావుకి మధ్య జరిగిన ఛాలెంజ్ గురించి మీకు తెలుసా ?

సూపర్ స్టార్ కృష్ణకి ఎస్వీ రంగారావుకి మధ్య జరిగిన ఛాలెంజ్ గురించి మీకు తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ సీనియర్ నటులు అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ-ఎస్.వీ.రంగరావు గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణకు డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అనే పేరు ఉండేది. ఒకానొక సందర్భంలో ఎన్టీఆర్ తో పోటీ పడేవారు. ఎన్టీఆర్ తో పోటీ పడి కొన్ని సినిమాలు ఫ్లాప్ అయితే.. మరికొన్ని సక్సెస్ సాధించారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ కి ధీటు అయిన నటుడిగా ఎస్.వీ.రంగారావుకి మంచి పేరు ఉంది. అలాంటి వీరిద్దరి మధ్య ఓ ఛాలెంజ్ చేసుకునే అవకాశం ఎక్కడ వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

 

ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ ఏదైనా కొత్త ప్రయోగం చేయాలంటే ముందుండేవారు. అప్పటితరంలో ఉన్న ఏ హీరో కూడా అంతగా ధైర్యం చేసే వారు కాదని పలు సందర్భాల్లో సినీ ప్రముఖులు చెప్పేవారు. పదేళ్ల కాలంలో 100కి పైగా సినిమాలు చేసిన రికార్డు కేవలం సూపర్ స్టార్ కృష్ణకి మాత్రమే ఉందంటేనే మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. దాదాపు 350కి పైగా సినిమాల్లో నటించారు. హీరోగా మంచి క్రేజ్ మీదున్న కృష్ణ ఆ తరువాత తన సోదరులతో కలిసి నిర్మాణ సంస్థను స్టూడియోను ప్రారంభించి సొంతంగా సినిమాలు కూడా నిర్మించేవారు. ఈ నేపథ్యంలోనే పండంటి కాపురం సినిమాను నిర్మించారు కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ-విజయ నిర్మల ఇందులో జంటగా నటించారు. ఈ సినిమాను హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన సునెహ్రా సన్సార్ అనే మూవీ ఆధారంగా తెలుగులో రీమేక్ చేశారు. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించినవిధంగానే తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

Advertisement

ఇకపోతే ఈ మూవీకి సంబంధించిన చాలా ఆసక్తికరమైన విషయాలు ఈ చిత్రానికి ఓ మేకప్ మేన్ గా పని చేసిన మాధవరావు ఓ సందర్భంలో వెల్లడించారు. నటించిన ఎస్.వీ.రంగారావు ఓ రోజు ఎక్కువగా తాగడం వల్లనే షూటింగ్ కి రాలేదట. అప్పటికే సెట్ లో కృష్ణ, విజయ నిర్మల, గుమ్మడి, అంజలిదేవి, జమున, బి.సరోజా దేవి, ప్రభాకర్ రెడ్డి ఇలా ప్రధాన తారాగణం ఆయన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. కానీ ఆయన రాకపోవడంతో షూటింగ్ ఆగిపోయింది. దీంతో ఈ విషయం సెట్ లో ఉన్న వారికి ఈ విషయం తెలిసి ఇబ్బంది పడ్డారట. అప్పట్లో చాలా మంది గుమ్మడి గారి మీద కోపంతో ఊగిపోయేవారట. హీరో కృష్ణ మాత్రం ఆయనకి ఇచ్చిన పాత్రను మరెవ్వరూ చేయలేరని.. ఆయన వచ్చినప్పుడే షూటింగ్ చేద్దామని చెప్పారట.  అంత నమ్మకం పెట్టుకున్నటువంటి కృష్ణతో ఆ మరుసటి రోజునే ఎస్.వీ.రంగారావు తాను చేసిన పనికి సిగ్గు తెచ్చుకుంటూ అలా మరెప్పుడు చేయను అని..  కావాలంటే ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పి అప్పటి నుంచి తాగడం మానేశాడట. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఆ స్టార్ హీరోయిన్ సావిత్రి మనవరాలు అనే విషయం మీకు తెలుసా ?

రియల్ స్టార్ హీరో శ్రీహరికి రెండు సార్లు పెళ్లి జరిగిందనే విషయం మీకు తెలుసా ?

ప్రాజెక్ట్ K లో ప్రభాస్ డబుల్ యాక్షన్ చేయనున్నాడా..? దాని అర్థం అదేనా ?

Visitors Are Also Reading