Home » పవన్ కళ్యాణ్ కరాటే లో బ్లాక్ బెల్ట్ అని మీకు తెలుసా..?

పవన్ కళ్యాణ్ కరాటే లో బ్లాక్ బెల్ట్ అని మీకు తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతటి క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలుసు.. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ పొందారట.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలోనే ఈ శిక్షణ తీసుకొని బ్లాక్ బెల్ట్ వరకు వెళ్లారని సమాచారం. పవన్ కళ్యాణ్ ఈ శిక్షణ కోసం చాలా కష్టపడ్డారట. తమిళనాడులో కరాటే ట్రైనింగ్ తీసుకున్న పవన్ కళ్యాణ్ తనకు కావలసిన వ్యక్తి దగ్గరే నేర్చుకోవాలని దృఢ సంకల్పం ట్రైనర్ ఇంటి చుట్టూ తిరిగారట. ఎందుకంటే ఆ ట్రైనర్ అప్పటికే మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం మానేసి సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుకుంటూ జీవిస్తున్నారట.

also read:IPL 2023 : కొత్త కెప్టెన్‌ను అనౌన్స్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్

Advertisement

Advertisement

కానీ పవన్ కళ్యాణ్ అతని దగ్గర నేర్చుకోవాలని లేదంటే అతని కోసం ఎదుట తెగేసి కూర్చున్నారట. ఎంత చెప్పినా వినకపోయేసరికి చివరికి ట్రైనర్ కొన్ని కండిషన్స్ తో ట్రైనింగ్ ఇచ్చారట. ఉదయం ఐదు గంటలకి ఇంటికి రావాలని అలాగే రాత్రి 11 గంటలకు వరకు తనతోనే ఉండాలని ఖాళీ ఉన్న సమయంలో తన ఒక అర్థగంట మాత్రమే నేర్పిస్తానని అన్నారట. దీనికి పవన్ కళ్యాణ్ కూడా ఓకే చెప్పి రోజు తెల్లవారుజామున వెళ్లి ట్రైనర్ ఇంటి ముందు ఎదురు చూసేవారట , ఆ వ్యక్తికి టీ పెట్టి ఇవ్వడం కరాటే నేర్చుకునే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవడం వంటి పనులన్నీ పవన్ కళ్యాణ్ దగ్గరుండి చూసుకున్నారని అప్పటికి పవన్ కళ్యాణ్ పేరు పవన్ కుమార్ గానే ఉండేదని అలా మూడు నెలలపాటు ట్రైనింగ్ తీసుకున్న పవన్ కళ్యాణ్ గురించి ఆ ట్రైనర్ కు పూర్తిగా తెలిసిందట.

also read:క‌డుపుబ్బా న‌వ్వించే బ్రహ్మానందం జీవితంలో ఇంత విషాదం ఉందా..?

ఇతగాడు మెగాస్టార్ తమ్ముడని తెలిసాక సీరియస్ గా ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారట. అలా సంవత్సర కాలం పాటు ట్రైనింగ్ తీసుకున్న పవన్ కళ్యాణ్ బ్లాక్ బెల్ట్ అందుకున్నాడని, పవన్ కళ్యాణ్ కి ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి పవన్ అనే పేరు పెట్టారని ట్రైనర్ ఒక సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విషయాలు బయట పెట్టారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరహర వీరమల్లు సినిమా కోసం కాస్త ట్రైనింగ్ తీసుకుంటున్నారట.

also read:Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

Visitors Are Also Reading