Home » క‌డుపుబ్బా న‌వ్వించే బ్రహ్మానందం జీవితంలో ఇంత విషాదం ఉందా..?

క‌డుపుబ్బా న‌వ్వించే బ్రహ్మానందం జీవితంలో ఇంత విషాదం ఉందా..?

by AJAY
Published: Last Updated on

తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో టాప్ క‌మెడియ‌న్ అంటే ట‌క్క‌న చెప్పే పేరు బ్ర‌హ్మానందం. వంద‌ల చిత్రాల‌లో న‌టించి బ్ర‌హ్మానందం స్టార్ క‌మెడియ‌న్ గా ఎదిగాడు. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా కంటెంట్ ఉన్న సినిమాల‌లో న‌టిస్తూ కొన్ని సినిమాల‌ను త‌న కామెడీతో హిట్ అయ్యేలా చేశాడు. ఇటీవ‌ల కాలంలో వృద్ధాప్యం వ‌ల్ల బ్ర‌హ్మి సినిమాలు త‌క్కువ చేస్తున్నార‌ని కానీ ఆయన ఒక‌ప్పుడు చేసిన సినిమాలు మ‌రియు మీమ్స్ ద్వారా ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తూనే ఉన్నారు.

 

సినిమాలోనే కాకుండా బ్ర‌హ్మానందం బ‌య‌ట క‌నిపించినా న‌వ్వులు పూయాల్సిందే. అయితే బ్ర‌హ్మానందం సినిమా జీవితం గురించి తెలియ‌ని వారు ఉండ‌రు కానీ ఆయ‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి మాత్రం అతికొద్ది మందికి మాత్ర‌మే తెలుసు. కాగా రీసెంట్ గా బ్ర‌హ్మీ రంగ‌మార్తాండ సినిమాలో న‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ క‌మెడియ‌న్ గా న‌టించిన బ్ర‌హ్మి ఈ సినిమాలో మాత్రం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా న‌టించారు.

brahmanandam wife

brahmanandam

ఈ నేప‌థ్యంలో ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న బ్ర‌హ్మానందం ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఒక‌ప్పుడు త‌న‌కు రెండు పూట‌లా తిన‌డానికి తిండి కూడా దొరికేది కాద‌ని అన్నారు. అలాంటి క‌ష్ట స‌మ‌యంలో తాను ఎంఏ పూర్తి చేశాన‌ని చెప్పారు. అప్ప‌డు చాలా క‌ష్ట‌ప‌డ్డాన‌ని ఇప్పుడు పేరు ప్ర‌ఖ్యాత‌లు వ‌చ్చాయ‌ని అన్నారు. కాగా ఇప్పుడు ఆ పేరు ప్ర‌ఖ్యాత‌ల‌ను కాపాడుకోవడానికి క‌ష్ట‌ప‌డుతున్నాన‌ని చెప్పారు.

ALSO READ :ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలో మ‌ల్లారెడ్డికి బంప‌రాఫ‌ర్..కానీ ఎందుకు రిజెక్ట్ చేశారంటే..?

Visitors Are Also Reading