Home » నాగార్జున ఎంతో ఇష్టంగా న‌టించిన సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అని మీకు తెలుసా..?

నాగార్జున ఎంతో ఇష్టంగా న‌టించిన సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అని మీకు తెలుసా..?

by Anji
Ad

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒక‌రైన కింగ్ నాగార్జున గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఈయ‌న త‌న సినీ కెరీర్‌లో ఎన్నో సంచ‌ల‌న విజ‌యాల‌ను సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ కి ఎంతో మంది కొత్త దర్శ‌కుల‌ను, హీరోల‌ను ప‌రిచ‌యం చేసిన హీరో నాగార్జున‌ అనే చెప్పాలి. అంతేకాదు.. కొత్త టాలెంట్ ను వెలికి తీసి మ‌రి అవ‌కాశాలిచ్చే ప‌నిలో ఉంటారు నాగార్జున‌. ఇటీవ‌ల నాగార్జున న‌టించిన బంగార్రాజు సినిమా ఘ‌న విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం ది ఘోస్ట్‌, బ్ర‌హ్మాస్త సినిమాల‌తో విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాడు నాగార్జున.


నాగార్జున హీరోగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు మ‌హేష్ భ‌ట్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించిన చిత్రం క్రిమిన‌ల్. ఇక బాలీవుడ్ డైరెక్ట‌ర్ మ‌హేష్ భ‌ట్ తెలుగులో ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఏకైక చిత్రం కూడా ఇదే కావ‌డం విశేషం. ఈ సినిమాలో నాగార్జున ఎంతో ఇష్ట‌ప‌డి న‌టించార‌ట‌. ఇందులో నాగార్జున డాక్ట‌ర్ అజ‌య్ పాత్ర‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. ఈ సినిమాలోని కొన్ని స‌న్నివేశాల‌ను ప్యుజిటివ్ అనే ఇంగ్లీషు సినిమా నుంచి కాపీ కొట్టార‌ని అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో టాక్ వినిపించింది. క్రిమిన‌ల్ సినిమాలో న‌టించేట‌ప్పుడు మ‌రో సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌చ్చినా స‌రే నాగార్జున ఈ సినిమాకి ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చాడు.

Advertisement

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  వెంకీ మామ కొడుకు అర్జున్ ద‌గ్గుబాటి ఎంత అందంగా ఉన్నాడో చూశారా..? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..?

ఈ సినిమాలో మ‌నీషా కోయిరాల‌, ర‌మ్య‌కృష్ణ క‌థానాయిక‌లుగా న‌టించారు. ఇందులో కీర‌వాణి మ్యూజిక్ సినిమాలోని పాట‌లు ఊహించ‌ని స్థాయిలో హిట్ అయ్యాయి. సంగీతం దిగ్గ‌జం ఎం.ఎం.కీర‌వాణి అందించిన స్వ‌రాలు సంగీత ప్రియుల‌ను ఎంత‌గా అల‌రించాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌ధానంగా తెలుసా మ‌న‌సా సాంగ్ ఎవ‌ర్ గ్రీన్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో స‌క్సెస్ సాధించ‌లేదు. ఇందులో కీర‌వాణి మ్యూజిక్ సినిమాలోని పాట‌లు ఊహించ‌ని స్థాయిలో హిట్ అయ్యాయి. ఈ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో స‌క్సెస్ సాధించ‌లేదు. ఇక ఈ సినిమా వ‌ల్ల‌ నాగార్జున పూర్తిగా అయ్యార‌ని స‌మాచారం.

ఇది కూడా చ‌ద‌వండి :  సీనియ‌ర్ ఎన్టీఆర్ ఆ స్టార్ హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డి రెండో పెళ్లి చేసుకోవాల‌నుకున్నారా..?

Visitors Are Also Reading