Home » వెంకీ మామ కొడుకు అర్జున్ ద‌గ్గుబాటి ఎంత అందంగా ఉన్నాడో చూశారా..? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..?

వెంకీ మామ కొడుకు అర్జున్ ద‌గ్గుబాటి ఎంత అందంగా ఉన్నాడో చూశారా..? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..?

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో కొంత‌మంది త‌మ పిల్ల‌ల‌ను చిన్న‌నాటి నుండే గ్లామ‌ర్ ఫీల్డ్ కు ద‌గ్గ‌ర‌గా పెంచితే మ‌రికొంద‌రు మాత్రం సినిమా గాలి కూడా త‌గ‌ల‌కుండా పెంచుతుంటారు. ఇక ఇండ‌స్ట్రీలో స్టార్ హీరో అయిన‌ప్ప‌టికీ సొంతంగా స్టూడియో ఉండ‌టంతో పాటూ బ్యాన‌ర్ లు ఉన్న‌ప్ప‌టికీ విక్ట‌రీ వెంట‌కేష్ త‌న కుటుంబాన్ని సినిమాల‌కు చాలా దూరంగా ఉంచుతాడు. వెంక‌టేష్ కు ఇద్ద‌ర కుమార్తెలు ఓ కుమారుడు ఉన్నారు.

Advertisement

పెద్ద కుమార్తె సొంత టాలెంట్ తో ఫుడ్ కు సంబంధించిన వీడియోలు ఫోటోల‌ను షేర్ చేసి ల‌క్ష‌ల్లో అభిమానుల‌ను సంపాదించుకుంది. భ‌ర్త‌తో క‌లిసి విదేశాల్లో ఉంటోంది. ఇక వెంక‌టేష్ కొడుకు విష‌యానికి వ‌స్తే అత‌డి పేరు అర్జున్ కాగా మీడియా కంట అతికొద్దిసార్లు మాత్రమే ప‌డ్డాడు. వెంక‌టేష్ కొడుకు అర్జున్ చిన్న‌త‌నంలోని ఫోటోలు మాత్రమే ఇప్ప‌టి వ‌ర‌కూ బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

Advertisement

కాగా అర్జున్ ఇప్పుడు చూడ్డానికి హీరోలా క‌నిపిస్తున్నాడు. అంతే కాకుండా ఎత్తులో ఇప్ప‌టికే వెంక‌టేష్ ను బీట్ ను చేశాడు. లాక్ డౌన్ స‌మ‌యంలో రానా ప్రీవెడ్డింగ్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. కాగా ఆ ప్రీవెడ్డింగ్ లో తండ్రి అక్క‌ల‌తో క‌లిసి అర్జున్ సంద‌డి చేశాడు. ఆర‌డుగుల ఎత్తుతో అంద‌రి దృష్టిని త‌న‌వైపు తిప్పుకున్నాడు. పొడ‌వాటి చేతులు రింగుల జుట్టుతో అదేవిధంగా లేత గ‌డ్డం మీసంతో కనిపించాడు.

అప్ప‌ట్లో సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమా ఫంక్ష‌న్ లో మ‌హేశ్ బాబు త‌న‌యుడు గౌతమ్ తో పాటూ అర్జున్ కూడా క‌నిపించాడు. కానీ అప్పుడు ఇద్ద‌రూ చిన్న‌పిల్ల‌లే. ఇక ఇప్పుడు గౌత‌మ్ కూడా చాలా మారాడు. గౌత‌మ్ ఇప్ప‌టికే సినిమాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు వెంక‌టేష్ కుమారుడు కూడా జిమ్ నాస్టిక్ డ్యాన్స్ లో శిక్ష‌ణ తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా అర్జున్ చ‌దువు పూర్త‌వ‌గానే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడ‌ని కూడా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

Visitors Are Also Reading