Home » రెజ్లర్లకు మద్దతుగా నిలుస్తున్న క్రికెటర్లు.. అలాంటి పని చేయొద్దంటూ..?

రెజ్లర్లకు మద్దతుగా నిలుస్తున్న క్రికెటర్లు.. అలాంటి పని చేయొద్దంటూ..?

by Anji
Ad

గత కొంతకాలంగా రెజ్లర్లు ఢిల్లీ నడిబొడ్డున నిరసన దీక్ష చేపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో వారికి దేశవ్యాప్తంగా ఎంతో మద్దతు లభిస్తుంది. అయితే రెజ్లర్లకు అండగా 1983 వరల్డ్ కప్ క్రికెటర్లు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెజ్లర్లు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి పథకాలను గంగా నదిలో వేయవద్దని అన్నారు. మీరు ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల మేము ఆందోళన చెందుతున్నామని తెలియజేశారు.

Advertisement

తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోవద్దని ఒక ప్రకటన విడుదల చేశారు. దేశం గర్వించదగ్గ పథకాలను తీసుకువచ్చిన మిమ్మల్ని చూస్తుంటే దేశమంతా ఆవేదన వ్యక్తం చేస్తోందని, మీకు ప్రజలంతా సపోర్టుగా ఉంటారని వారన్నారు. మీరు పథకాలు సాధించడం కోసం ఏళ్ల తరబడి కష్టపడి ఎన్నో త్యాగం చేశారని మీ కృషి ఫలితమే ఆ పథకాలు అని వాటి వెనుక ఎన్నో దేశ ప్రతిష్టలు దాగున్నాయని తెలియజేశారు. అయితే 1983 క్రికెట్ వరల్డ్ కప్ విన్నర్ జట్టు ఈ ప్రకటనను విడుదల చేసింది. వీరిలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ కూడా ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయం.

Advertisement

manam News

ముఖ్యంగా  టీమిండియా మాజీ క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు వారికి అండగా నిలుస్తున్నారు. అథ్లెట్లకు న్యాయం జరగాలని కోరారు. కపిల్‌దేవ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, హర్భజన్‌ సింగ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ సోషల్‌ మీడియాలో సపోర్ట్‌ ఇచ్చారు.భారత రెజ్లింగ్‌ సంఘం అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌ను  తొలగించాలని రెజ్లర్లు ఆందోళన చేపడుతున్నారు. మహిళా రెజ్లర్లను ఆయన  వేధించారని, శారీరకంగా ఇబ్బంది పెట్టారని వారు ఆరోపిస్తున్నారు. బ్రిజ్‌ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. దాంతో ఆయనపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసి దర్యాప్తు చేపడతామని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

మీ భార్యలో ఈ ఒక్క లక్షణం కనిపించిందంటే మరొకరితో రిలేషన్ లో ఉన్నట్టే..?

ఆహారం తిన్న వెంటనే ఈ పనులు చేస్తే దరిద్రం మీ వెంటే..!

 

Visitors Are Also Reading