Home » NTR సిఎంగా ఉన్న‌ప్పుడు సినిమా టికెట్ రేట్లు పెంచ‌మ‌న్న దాస‌రితో NTR ఏమ‌న్నాడో తెలుసా?

NTR సిఎంగా ఉన్న‌ప్పుడు సినిమా టికెట్ రేట్లు పెంచ‌మ‌న్న దాస‌రితో NTR ఏమ‌న్నాడో తెలుసా?

by Azhar
Ad

అప్ప‌ట్లో NTR రాష్ట్రం మొత్తం మీద ఆరో ఏడో సినిమా హాళ్లు ఉండేవి … హైద్రాబాదులో మూడు హాళ్లు , బెజవాడలో రెండు, తెనాలిలో ఒకటి ఉండేవనుకుంటా!అలాగే ఒకటి రెండు థియేటర్లలో ఆయనకు భాగస్వామ్యం కూడా ఉండేది. అప్పట్లో ఒకే టిక్కెట్టు మీద పది మందిని లోపలికి పంపి థియేటర్లో ఉండే వంద మందికి పది టిక్కెట్లే తెంపి … వాటికే టాక్స్ కట్టేవారు. ఈ విషయం తెల్సిన NTR సిఎం అయినప్పుడు … స్లాబ్ సిస్టమ్ పెట్టడమే కాక టిక్కెట్ల రేట్లు తగ్గించమని ఆదేశాలు జారీ చేశారు.

Also Read: ఒకే తరగతిలో..ఓకే క్లాసులో చదువుకున్న సెలబ్రిటీలు వీరే..!

Advertisement

సినిమా పరిశ్రమ నుంచీ ప్రతినిధి వర్గం ఆయన దగ్గరకు పోయింది. అందులో దాసరి నారాయణరావుగారు కీలకం. ఏమిటి సమస్య అన్నారు దాసరిని ఉద్దేశించి NTR. అయ్యా ఎగ్జిబిటర్లు బావురుమంటున్నారు అన్నారు దాసరి …దాసరిగారూ … రాష్ట్రంలో నాకు ఆరు సినిమా హాళ్లు ఉన్నాయి. నాకంటే పెద్ద ఎగ్జిబిటర్ ఎవరైనా ఉంటే వాడు బాధ పడుతుంటే వాణ్ణి పట్టుకురండి … వింటాను అని పంపేశారు.

Advertisement

అలా అన్నగారు పెట్టిన స్లాబు పద్దతి రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు తీసేశారు. ఆయన స్లాబు తీసేస్తూ … టిక్కెట్ల రేట్లు తగ్గిస్తూ జీవో ఇచ్చారు. డెబ్బై రూపాయలుగా ఉన్న బాల్కనీ రేట్ ను యాభై కి తగ్గించారు వైఎస్.ఎన్టీఆర్ కు చాలా సన్నిహితంగా ఉండే ఒకాయ‌నకి విజ‌య‌వాడ‌లో రెండు థియేట‌ర్లు ఉండేవి. వాటిలో టిక్కెట్ల రేట్లు పక్క థియేటర్ల కంటే కాస్త పెంచి వసూలు చేస్తే NTR అత‌డిని పిల‌పించి మ‌రీ రేట్లు తగ్గించమని వార్నింగ్ ఇచ్చాడ‌ట‌!

Also Read: ఎన్టీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు టిఫన్ ధరలు నిర్ణయించారని తెలుసా ? ఇడ్లి, దోశ ఎంతంటే? ?

Credits : Bharadwaja Rangavajhala

Visitors Are Also Reading