Home » కరాటే కళ్యాణి మా సభ్యత్వంపై శ్రీరెడ్డి ఏమందో తెలుసా ?

కరాటే కళ్యాణి మా సభ్యత్వంపై శ్రీరెడ్డి ఏమందో తెలుసా ?

by Anji
Ad

గత కొద్ది రోజుల నుంచి ఖమ్మంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరగకూడదు అంటూ సినీ నటి, మా అసోసియేషన్ సభ్యురాలు అయిన కరాటే కళ్యాణి గొడవ చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించిన వ్య‌క్తి కావ‌టంతో ఈ గొడ‌వపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ రియాక్ట్  అయింది. క‌రాటే క‌ళ్యాణికి నోటీసులను పంపించింది. వివర‌ణ అడిగింది. అయితే వివ‌ర‌ణ న‌చ్చ‌లేదో లేక మ‌రేదైనా కార‌ణ‌మో తెలియ‌దు కానీ కరాటే క‌ళ్యాణిని మా అసోసియేష‌న్ నుంచి తొల‌గించారు. దీనిపై స్పందిస్తూ.. ఇండ‌స్ట్రీని ఇన్నాళ్లూ వెన‌కేసుకొచ్చినందుకు త‌న‌కు త‌గిన బహుమ‌తిని ఇచ్చారంటూ క‌రాటే క‌ళ్యాణి కీలక వ్యాఖ్యలు చేసింది. 

Advertisement

నెటిజ‌న్స్ కూడా ఈ ఘ‌ట‌న‌పై త‌మ‌దైన రీతిలో స్పందిస్తున్నారు. కొంద‌రు క‌రాటే క‌ళ్యాణికి త‌మ మ‌ద్దతుని తెలియ‌జేస్తున్నారు. అయితే ఓ నెటిజ‌న్ వేసిన ప్ర‌శ్న అందరి దృష్టిని ఆక‌ర్షించింది. అదేంటంటే.. గ‌తంలో మెగాస్టార్ ఫ్యామిలీని తిట్టిన న‌టి శ్రీరెడ్డి, న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళిపై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేదంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ప్ర‌శ్నించాడో నెటిజ‌న్‌. మా అధ్య‌క్షుడు విష్ణు మంచుని ట్యాగ్ చేశాడు. దీనిపై శ్రీరెడ్డి రియాక్ట్ అయింది.  ఈ గొడ‌వ‌లోకి తనను లాగొద్దంటూ ఆమె కామెంట్ రూపంలో స‌మాధానం చెప్పింది.  విష్ణు మంచు ఏమైనా రియాక్ట్ అవుతారో లేక అలాగే ఉండిపోతారో చూడాలి.  

Advertisement

 

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు దిగ్గ‌జంగా పిలుచుకునే ఎన్టీఆర్‌పై క‌రాటే క‌ళ్యాణి చేసిన కామెంట్స్ ఇప్పుడు  వైర‌ల్  అవుతున్నాయి. ఆయ‌న గొప్ప‌న‌టుడే కావ‌చ్చు. కానీ దేవుడు కాద‌ని.. శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఆయ‌న విగ్ర‌హ ప్ర‌తిష్ట జ‌రుపకూడదంటూ  కామెంట్స్ చేసింది. యాద‌వ‌, హిందూ సంఘాల‌తో క‌లిసి పోరాటం చేసింది. మా అధ్య‌క్షుడు విష్ణు దీని గురించి ఆమె ప్ర‌త్యేకంగా పిలిచి మాట్లాడిన‌ప్ప‌టికీ ఆమె మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఈ ప‌రిణామాల‌తో క‌రాటే క‌ళ్యాణి మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ సీరియ‌స్‌గా చ‌ర్య‌లు తీసుకుంది.అయితే త‌న‌ను మా అసోసియేష‌న్ నుంచి తొల‌గించ‌టంపై క‌రాటే క‌ళ్యాణి స్పందించింది. తనకు షోకాజ్ నోటీసు ఇచ్చిన తరవాత మూడు రోజుల సమయం ఇచ్చారని.. అయితే ఆరోగ్యం బాగోలేక‌పోవ‌టంతో త‌న లాయర్‌కు చెప్పి తనకు ఇంకా సమయం కావాలని ఒక నోటీసు రాసి పంపానన్నారు క‌ళ్యాణి. అయితే అసోసియేష‌న్ త‌ను పంపిన అభ్య‌ర్థ‌న‌న‌ను లీగల్ నోటీసుగా భావించి తనను సస్పెండ్ చేశారని కరాటే కళ్యాణి బాధ‌ను వ్యక్తం చేశారు. తరువాత కరాటే కళ్యాణి పరిస్థితి ఏంటనీ అందరూ చర్చించుకోవడం విశేషం.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

శాకుంతలం సినిమాకి కలెక్షన్లు రాకపోవడానికి పరిచూరి చెప్పిన కారణం ఏంటో తెలుసా ?

త్రివిక్రమ్ పై బండ్ల గణేష్ ట్వీట్స్.. అందుకోసమేనా ?

Visitors Are Also Reading