Home » త్రివిక్రమ్ పై బండ్ల గణేష్ ట్వీట్స్.. అందుకోసమేనా ?

త్రివిక్రమ్ పై బండ్ల గణేష్ ట్వీట్స్.. అందుకోసమేనా ?

by Anji
Published: Last Updated on

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్  ఈ మధ్య కాలంలో తరచూ ఏదో ఒక ట్వీట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైనటువంటి త్రివిక్రమ్ పై తన దైన స్టైల్ లో సెటైర్లువేస్తున్నారు. నేరుగా కాకుండా.. ఇన్ డైరెక్ట్ గా ? ఎక్కడ కూడా త్రివిక్రమ్ పేరుని ప్రస్తావించకుండా గురూజీ అని సంబోధిస్తూ ట్విట్స్ చేస్తున్నాడు బండ్ల గణేష్.  త్రివిక్రమ్ ని టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ గురూజీ అని సంబోధిస్తుంటారు. ఎప్పుడూ ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్ తో ఓ నెటిజన్ తను ప్రొడ్యూసర్ కావాలనుకుంటున్నానని తన కోరికను ప్రస్తావించాడు. 

 

అందుకు బండ్ల గణేష్ రియాక్ట్ అవుతూ.. ‘గురూజీని కలిసి కాస్ట్ లీ గిప్ట్ ఇవ్వు.. నువ్వు అనుకున్నది అయిపోతుంది’ అని ట్వీట్ చేశాడు. ఇక అక్కడి నుంచి వరుస ట్వీట్లు వేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో  తెగ వైరల్ అవుతున్నాయి. ‘భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి.. భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్భార్ సుత్తి’ అని మరోసారి గురూజీపై ఉన్న కోపాన్ని వెల్లగక్కాడు.  కొందరూ నెటిజన్లు బండ్ల గణేష్ కి మద్దతు ఇస్తుంటే.. మరికొందరూ మాత్రం విమర్శిస్తున్నారు. భక్తుడిని దూరం చేసే శక్తి ఎవ్వరికీ ఉండదు. ‘భక్తుడి నడవడిక మాత్రమే భగవంతుడిని దూరం చేస్తుంది’ అని ఒకరంటే.. ‘వీడు ఒక పెద్ద గుంట నక్క వీడిని నమ్మకండి. స్వార్థం కోసం పవన్ కళ్యాణ్ ని దేవుడు’ అంటూ ఉంటాడు’ అని మరొకరు పేర్కొన్నారు. ఇకనైనా టార్గెట్ గురూజీ మిషన్ ని బండ్ల గణేష్ ఆపేస్తాడో లేక ఇలాగే కొనసాగిస్తాడో చూడాలి. 

త్రివిక్రమ్  పేరు చెప్పకుండా గురూజీ అని బండ్ల గణేష్ ఇది వరకు చాలా ట్వీట్స్ పోస్ట్ చేశారు. భీమ్లానాయక్ సినిమాకి  ముందు వరకు పవన్ తో సన్నిహితంగా ఉంటూనే వచ్చిన బండ్ల గణేష్..  భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ సమయానికి అంతా త్రివిక్రమ్ కావాలనే పక్కకు పెట్టించారనే వార్తలు వినిపించాయి. ముఖ్యంగా పవన్ క్యాంప్ కి బండ్ల దూరమయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తరువాత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో సపోర్టు చేస్తూ వచ్చాడు బండ్ల గణేష్. ప్రస్తుతం ఆ దూరం పెరిగినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఎక్కడ కూడా బండ్ల గణేష్ పేరుని కూడా ప్రస్తావించడం లేదు పవన్ కళ్యాణ్. మరోవైపు బండ్ల గణేష్ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

విదేశాల్లో చదువుల కోసం… ఇంటిని అమ్మి మరీ… చివరికి!

శాకుంతలం సినిమాకి కలెక్షన్లు రాకపోవడానికి పరిచూరి చెప్పిన కారణం ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading