Home » అల్లు అర్జున్ మొదటి సినిమా “గంగోత్రి” హీరోయిన్ ఇప్పుడెలా ఉందొ తెలుసా ? అస్సలు గుర్తు పట్టలేరు గా !

అల్లు అర్జున్ మొదటి సినిమా “గంగోత్రి” హీరోయిన్ ఇప్పుడెలా ఉందొ తెలుసా ? అస్సలు గుర్తు పట్టలేరు గా !

by Anji
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ముఖ్యంగా పుష్ప సినిమాతోనే ఈ అల్లు అర్జునికి ఐకాన్ స్టార్ అనే బిరుదు వ‌చ్చింద‌నే చెప్పాలి. అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి గంగోత్రి సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు. మొద‌టి సినిమా అత‌నికి మంచి గుర్తింపు సంపాదించింది. తొలి న‌ట‌న‌తోనే స‌క్సెస్ అందుకున్నారు.

Advertisement

ఇక ఆ త‌రువాత ఆర్య వంటి ఎన్నో హిట్ సినిమాలు తీసిన అల్లు అర్జున్ టాలీవుడ్ అగ్ర హీరోల స‌ర‌స‌న చేరారు. ఎంతో మంది అభిమానుల‌ను సైతం సంపాదించుకున్నారు. ఈయ‌న మంచి స్టార్ హోదాలో ఉన్న‌ప్పుడే 2011లో స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్నాడు వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు.అల్లుఅర్జున్ సినిమాల‌కు ఎంత ప్రాధాన్య‌త ఇస్తాడో కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్య‌త ఇస్తాడు. త‌న‌కు సినిమా షూటింగ్ స‌మ‌యంలో కాస్త బ్రేక్ దొరికితే చాలు వెంట‌నే ఫ్యామిలీతో ల‌గేజ్ స‌ర్దుకొని విదేశ ప్ర‌యాణాల‌కెళ్తుంటాడు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి స‌మ‌యాన్ని గ‌డుపుతూ మంచి భ‌ర్త‌గా, మంచి తండ్రిగా నిలిచాడు అల్లు అర్జున్‌.

ఇది కూడా చ‌ద‌వండి  :  పుష్ప 2 క‌థ లీక్‌.. కీల‌కం అదేన‌ట‌..!

Advertisement


టాలీవుడ్‌లో స్నేహారెడ్డి, అల్లుఅర్జున్ జంట క్యూట్ క‌పుల్‌గా నిలిచింది. వీరు ఎప్పుడు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడంతో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. అంతేకాదు.. కొద్ది రోజుల కింద‌టే సోష‌ల్ మీడియాకు సంబంధించిన ఓ స‌ర్వేలో స్నేహ‌రెడ్డి తొలి స్థానంలో నిలిచింది. ముఖ్యంగా స్నేహారెడ్డి అల్లు అర్జున్ కి సంబంధించిన సినిమా అప్‌డేట్‌ల‌ను, ఫోటోల‌ను పిల్ల‌ల‌తో స‌ర‌దాగా ఆడుతున్న వీడియోల‌ను షేర్ చేస్తుంటుంది స్నేహ‌రెడ్డి. అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్‌కి బ్రేక్ రావ‌డంతో త‌న ఫ్యామిలీతో ట్రిప్ ని బాగా ఎంజాయ్ చేస్తున్న‌ట్టు క‌నిపించాడు. ఆయ‌న‌కు న్యూయార్క్‌లో గంగోత్రి హీరోయిన్ క‌నిపించింది. వీరిద్ద‌రూ క‌లిసి దిగిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. అప్ప‌టికీ ఇప్ప‌టికీ గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోయింది. గంగోత్రి సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన అదితి అగ‌ర్వాల్ సినిమాల‌కు దూరంగా ఉంటున్న విష‌యం విధిత‌మే. తాజాగా త‌న‌కు అల్లు అర్జున్ క‌నిపించ‌డంతో అత‌నితో దిగిన ఫోటోల‌ను పంచుకుంటూ కొన్ని స్వీట్ కామెంట్లు చేసింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఆ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

ఇది కూడా చ‌ద‌వండి  :  హై వోల్టేజ్ వైర్‌పై కూర్చున్న ప‌క్షుల‌కు షాక్ కొట్ట‌దు ఎందుకో తెలుసా..?

Visitors Are Also Reading