Home » హై వోల్టేజ్ వైర్‌పై కూర్చున్న ప‌క్షుల‌కు షాక్ కొట్ట‌దు ఎందుకో తెలుసా..?

హై వోల్టేజ్ వైర్‌పై కూర్చున్న ప‌క్షుల‌కు షాక్ కొట్ట‌దు ఎందుకో తెలుసా..?

by Anji
Ad

సాధార‌ణంగా మ‌నం చిన్న వైర్‌ని ప‌ట్టుకుంటేనే మ‌న‌కు క‌రెంట్ షాక్ వ‌స్తుంటుంది. కానీ హై వోల్టేజ్ వైర్ల‌పై ప‌క్షులు కూర్చున్నప్ప‌టికీ వాటికి ఏం కాదు. ఇలాంటి దృశ్యాలు మ‌నం నిత్యం ఏదో ఓ సంద‌ర్భంలో చూస్తూనే ఉంటాం. కొన్ని చోట్ల ప‌క్షి ఎల‌క్ట్రిక్ వైర్‌పై కూర్చుంటే మ‌రికొన్ని చోట్ల ప‌క్షుల స‌మూహం వైర్ల‌పై క‌నిపిస్తుంది. హాయిగా వైర్ మీద కూర్చొని ఎంజాయ్ చేస్తుంటాయి. కానీ వాటికి ఎప్పుడు క‌రెంట్ షాక్ కొట్ట‌దు.

Advertisement

విద్యుత్ అనేది వైర్ల ద్వారా ఇళ్ల లోకి ప్ర‌వేశిస్తుంది. ఇండ్ల‌లో ఉన్న ఎర్తింగ్ వైర్ ద్వారా స‌ర్క్యూట్ పూర్త‌యితే ఇంట్లో ఉన్న‌టువంటి బల్బులు, ఫ్యాన్లు త‌దిత‌ర వంటివి ప‌ని చేస్తాయి. కానీ ఓ ప‌క్షి గాలిలో వేలాడుతున్న వైర్‌పై కూర్చొని ఉన్న‌ప్పుడు స‌ర్క్యూట్ పూర్తి కానందున దానికి క‌రెంట్ షాక్ కొట్ట‌దు. మ‌రోవైపు ప‌క్షి నేల‌తో పాటు తీగ‌ను తాకిన‌ట్ట‌యితే దాని శ‌రీరం గుండా విద్యుత్ ప్ర‌వ‌హించ‌డం ప్రారంభ‌మ‌వుతుంది. అంటే దానికి షాక్ కొడుతుంది. ఇది అర్థం కావాలంటే విద్యుత్ ప్ర‌వాహ నియ‌మాన్నిమ‌నం అర్థం చేసుకోవాలి.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  అధిక బ‌రువు ఉన్న వారు చికెన్ అస్స‌లు తిన‌కూడ‌దు.. జాగ్ర‌త్త‌..!


విద్యుత్ అనేది వైర్ల ద్వారా ఒక చోటు నుంచి మ‌రో ప్ర‌దేశానికి ప్ర‌వ‌హిస్తుంది. అప్పుడు అది నిరోధించ‌బ‌డ‌దు. అలాంటి ప‌రిస్థితిలో విద్యుత్ ప్ర‌వాహాన్ని బాగా ప్ర‌వ‌హించేవిధంగా చేయ‌డానికి రాగిని ఉప‌యోగిస్తారు. ప‌క్షుల శ‌రీరంలో ఉన్న క‌ణ‌జాలాలు రాగి తీగ‌లో నిరోధ‌క‌త‌ను సృష్టించి విద్యుత్ ప్ర‌వాహాన్ని ప్ర‌భావితం చేస్తాయ‌ని నిపుణులు పేర్కొంటున్నారు. తీగ‌మీద కూర్చున్న త‌రువాత ప‌క్షుల‌కు షాక్ కొట్ట‌ద‌నేది వాస్తవం. ఇక్క గ‌మ‌నించాల్సిన విష‌యం ఏమిటంటే.. ప‌క్షులు వైర్‌తో పాటు భూమిని తాకిన‌ట్ట‌యితే అప్పుడు ఎర్తింగ్ స‌ర్క్యూట్ పూర్త‌వుతుంది. అప్పుడు ప‌క్షులు విద్యుదాఘాతానికి గుర‌వుతాయి. మ‌నుషుల విష‌యంలో కూడా అదే జ‌రుగుతుంది. మాన‌వ శ‌రీరం భూమితో పాటు సంప‌ర్కంలో ఉన్న‌ప్పుడు మాత్ర‌మే విద్యుత్ షాక్ కొడుతుంది. స‌ర్క్యూట్ పూర్త‌యిన కార‌ణంగా ఇలా జ‌రుగుతుంటుంది ఇది మ‌నం గ‌మ‌నించాలి.

ఇది కూడా చ‌ద‌వండి :  కృష్ణ వ‌దిలేసిన ఈ సినిమా చిరంజీవికి లైఫ్ ఇచ్చింది!?

Visitors Are Also Reading