Home » పవన్ కళ్యాణ్ కి పవర్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందో తెలుసా ? 

పవన్ కళ్యాణ్ కి పవర్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందో తెలుసా ? 

by Anji
Ad

పవన్ కళ్యాణ్ ని అభిమానులందరూ పవర్ స్టార్ అని చాలా పవర్ పుల్ గా పిలుచుకుంటారు. కానీ ఈ పేరు ఎలా వచ్చిందో..? ఎందుకు వచ్చిందో ? ఎప్పుడు వచ్చిందో ? ఎవ్వరూ పెట్టారో ఫస్ట్ పవర్ స్టార్ అని ఎవరు పిలిచారో చాలా మందికి తెలియదు.  దిక్కులు పెక్కటిల్లెలా పవర్ స్టార్.. పవర్ స్టార్ అంటూ తెలుగు రాష్ట్రాలు ఊగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఈ పవర్   స్టార్ పేరు మాత్రమే వినిపిస్తుంది. సోషల్ మీడియాలో అయితే ఇక మాటల్లో చెప్పలేము. అయితే ఇప్పుడు మనం ఎంతో పవర్ ఉన్న ఈ పవర్ స్టార్ పేరు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

పవన్ కళ్యాణ్ కెరీర్ లో మూడో సినిమా సుస్వాగతం.. ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ మూవీ సక్సెస్ మీట్ లో ఫస్ట్ టైమ్ పవర్ స్టార్ అనే పేరు వినిపించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై వివాదస్పద కామెంట్స్ చేస్తున్న పోసాని కృష్ణ మురళినే ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్  పవర్ స్టార్ అని పిలిచాడు. తరువాత అదే పేరు ఇప్పటివరకు ఉంది. సుస్వాగతం సినిమా టైటిల్స్ ఫస్ట్ టైమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని వేశారు. నేడు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన సినిమాల్లో నుంచి అప్డేట్ కూడా వరుస పెట్టి రావడంతో ఫ్యాన్స్ కి ట్రీట్ మీద ట్రీట్ వచ్చి పడుతున్నాయి.

Advertisement

తాజాగా ఓజీ టీజర్ రాగా.. ఇప్పటికే హరిహరవీరమల్లు పోస్టర్ వచ్చేసింది. అదేవిధంగా సురేందర్ రెడ్డి మూవీ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కూడా అప్డేట్ వచ్చే’సింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ మామూలుగా లేదు. పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీకి మించేలా కనిపిస్తోంది. పోస్టర్ చూస్తే ప్రేక్షుకులు ఫిదా అవుతున్నారు.  

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 టీజర్ రిలీజైన నిమిషాల్లోనే ఓజీ విధ్వంసం..!

వెంకటేష్ కి సౌందర్యతో బలవంతంగా రాఖీ ఎవరు కట్టించారు…?

Visitors Are Also Reading