Home » టీజర్ రిలీజైన నిమిషాల్లోనే ఓజీ విధ్వంసం..!

టీజర్ రిలీజైన నిమిషాల్లోనే ఓజీ విధ్వంసం..!

by Anji
Ad

 పవన్ స్టార్ పవన్  కళ్యాణ్ నటిస్తున్న తాజా మూవీ ఓజీ టీజర్ కాసేపటి కిందటే విడుదలైన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని విడుదలైన విషయం విధితమే. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని విడుదల చేసిన ఓజీ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. హాంగర్ చితా అనే పేరుతో రిలీజైన ఈ టీజర్ కి పవన్ కళ్యాణ్ అభిమానులు మెస్మరైజ్ అయ్యారనే  చెప్పాలి. 

Advertisement

దానయ్య డీవీవీ నిర్మాణంలో ఆర్.ఆర్.ఆర్.  వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వస్తోన్న ఈ ఓజీ మూవీపై టాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. వాటన్నింటినీ మ్యాచ్ కాసేలా కాసేపటి క్రితం రిలీజైన ఓజీ టీజర్ యూట్యూబ్ లో రిలీజైన కేవలం 20 నిమిషాల్లోనే 200కె లైక్స్ తో ఇంతకు ముందు ఉన్న రికార్డులు అన్నింటిని బ్రేక్ చేసి, ఫాస్టెస్ట్ మోస్ట్ లైక్ డ్ టీజర్ గా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాల మోజులో పడి, స్ట్రెయిట్ సినిమాలను చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడంతో పవన్ అభిమానులు గత కొద్ది రోజులుగా తీవ్రమైన అసంతృప్తి లో ఉన్నారు. 

Advertisement

og-movie-teaser-1

పవన్ కళ్యాణ్ సినిమాలకు కమ్ బ్యాక్ ఇచ్చినప్పటి రీమేక్ సినిమాలు చూసి.. విసిగిపోయి ఫ్యాన్స్ కి ఓజీ సినిమా ఫుల్ మిల్స్ పెట్టేలా ఉందని టీజర్ ద్వారా స్పష్టం అయింది. ఓజీ టీజర్ లో పవన్ కళ్యాణ్ లుక్స్, డైలాగ్స్ అన్నీ అందరినీ ఆకట్టుకున్నాయి. దాదాపు 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మరో షెడ్యూల్ కి రెడీ అవుతుంది.  విదేశాలలో జరుగబోతున్న ఈ షెడ్యూల్ కనుక పూర్తి చేస్తే.. దాదాపు సినిమాలోని మేజర్ పార్ట్ కంప్లిట్ చేసినట్టే అని టాక్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీలో ఉండే పలు కీలకమైన పాత్రల్లో ఇమ్రాన్ హష్మీ, శ్రియారెడ్డి, అర్జున్ దాస్ తదితరులు కనిపించబోతున్నారు. కేవలం టీజర్ తోనే ఇంత భారీ బజ్ ను క్రియేట్ చేసిన ఓజీ సినిమా రేపు రిలీజ్ తరువాత ఇంకెన్నీ రికార్డు బ్రేక్ చేస్తుందో లేదో  చూడాలి.  

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఖుషి సూపర్‌ హిట్.. అజ్ఞాతంలోకి నాగచైతన్య..?

వెంకటేష్ కి సౌందర్యతో బలవంతంగా రాఖీ ఎవరు కట్టించారు…?

Visitors Are Also Reading