Home » టైగర్ నాగేశ్వరావు మూవీ కోసం రవితేజ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా ?

టైగర్ నాగేశ్వరావు మూవీ కోసం రవితేజ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా ?

by Anji
Ad

మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ఓ మంచి సాలిడ్ హిట్ కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నాడు రవితేజ. ధమాకా మూవీతో హిట్ అందుకున్నా.. ఇక ఆ తరువాత మళ్లీ ఫ్లాప్స్ చూడాల్సి వచ్చింది. తాజాగా టైగర్ నాగేశ్వర్ రావుతో ప్రేక్షకులముందుకొచ్చాడు. రవితేజ నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ ఇది కావడం విశేషం. అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరావు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించారు. 

Advertisement

వాస్తవఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు వంశీ. మొదటి షో నుంచే టైగర్ నాగేశ్వరరావు సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. ఒక దొంగ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు వంశీ. ఇక ఈ  సినిమాకి కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి. ఈ సినిమాలో రేణు దేశాయ్‌, అనుపమ్‌ ఖేర్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాను దాదాపు రూ.50కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమా కోసం రవితేజ భారీగానే రెమ్యునరేషన్ అందుకున్నాడని తెలుస్తోంది. రవితేజ ఏకంగా రూ.18 కోట్ల వరకు వసూల్ చేశారని తెలుస్తోంది. 

Advertisement

Tiger Nageswara Rao movie review

Tiger Nageswara Rao movie 

రవితేజ హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే రవితేజ ఒకొక్క సినిమాకు 10 కోట్ల వరకు వసూల్ చేస్తున్నారట. ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమా పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమా కోసం ఏకంగా 18కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో టైగర్ నాగేశ్వరరావు సినిమా 100కోట్ల వరకు వసూల్ చేస్తుందని అంటున్నారు. ఇక ఈ మూవీ ఓటీటీ పార్ట్నర్  అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుందని తెలుస్తోంది. నెల రోజుల తర్వాత టైగర్ నాగేశ్వరరావు సినిమా ఓటీటీలో విడుదల అయ్యే అవకాశముంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ప్లస్, మైనస్ పాయింట్స్ ఇవే…!

టాలీవుడ్‌ సింగర్ గీతా మాధురి విడాకులు….అసలు వాస్తవం ఇదే!

Visitors Are Also Reading