Home » కేంద్ర బ‌డ్జెట్‌ను ఎలా త‌యారు చేస్తారో తెలుసా?

కేంద్ర బ‌డ్జెట్‌ను ఎలా త‌యారు చేస్తారో తెలుసా?

by Anji
Ad

బడ్జెట్‌ అనగానే చాలామంది లెక్కల చిక్కులే అనుకుంటారు. కానీ ఈ మూడక్షరాల వెనుక చాలా శ్ర‌మ దాగివుంటుంది. ఎంతో కసరత్తు..లెక్కకు మించి భేటీలు.. ఎంతో ర‌హ‌స్యం.. అబ్బో చాలా తతంగమే ఉంటుంది. మ‌రీ ఇంత బ‌డ్జెట్‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఎలా త‌యారు చేస్తుంది..ఎలా లెక్క‌లేస్తారు.. ఏ వ‌ర్గానికి ఎంత బ‌డ్జెట్ కేటాయిస్తార‌ని చాలా మందికి వ‌చ్చే అనుమానం. ఆ అనుమాన‌ం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

సెప్టెంబర్ లో..

రానున్న ఆర్థిక సంవత్సరంలో ఏయే రంగానికి ఎంత ఖర్చు పెట్టాలన్న కసరత్తు ప్రారంభ‌మ‌వుతుంది. దేశంలో మొత్తం జనాభా తమ తిండి కోసం ఏడాదికి ఎంత ఖర్చు చేస్తున్నారో దాదాపు అంత మొత్తాన్ని ప్రభుత్వం బడ్జెట్‌కు కేటాయిస్తుంది.

అక్టోబర్ : 

తమకు కావాల్సిన నిధులపై వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు ఆర్థికశాఖతో చర్చలు జ‌రుగుతాయి. ఏ శాఖ‌లో ఏ రంగానికి ఎంత నిధులు కేటాయించాల‌నే దానిపై తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

డిసెంబర్ : 

Advertisement

ముసాయిదా బడ్జెట్‌ కాపీలను అధికారులు ఆర్థికమంత్రికి నివేదిస్తారు. ఈ ముసాయిదా పత్రాలన్నీ నీలం రంగులో ఉంటాయి.

 

జనవరి :

పారిశ్రామిక, బ్యాంకింగ్‌ రంగాలకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు ఆర్థికమంత్రిని కలసి తమ సమస్యలను సలహాలను, సూచనలను అందజేస్తారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి అందరి వాదనలు వింటారుగానీ ఎవరికీ నిర్దిష్టమైన హామీ ఇవ్వరు. ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నాయో వివ‌రిస్తారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ :

బడ్జెట్‌ ప్రతిపాదనలు ఏమాత్రం బ‌య‌ట‌కు లీక్‌ కాకుండా చూసే బాధ్యతను ఇంటెలిజెన్స్‌ విభాగం చూసుకుంటుంది. ఇందుకు కొందరు ఉన్నతాధికారుల ఫోన్లను సైతం ట్యాప్‌ చేస్తుంటుంది. బ‌డ్జెట్ ప్ర‌తిపాన‌ల‌పై గ‌ట్టి నిఘా ఉంటుంది.

ముద్రణ ప్రక్రియ :

బడ్జెట్‌కు సంబంధించిన అన్ని వివరాలను అత్యంత రహస్యంగా ఉంచేందుకు జనవరి నుంచి ఆర్థికమంత్రిత్వ శాఖ కార్యాలయాల్లోకి జర్నలిస్టుల ప్రవేశాన్ని నిషేధిస్తారు. ప‌క‌డ్బంధీ నిఘా ఉంటుంది.

 

Visitors Are Also Reading