Home » అఖిల్ ‘ఏజెంట్’ సెన్సార్ టాక్ ఎలా ఉందో తెలుసా ?

అఖిల్ ‘ఏజెంట్’ సెన్సార్ టాక్ ఎలా ఉందో తెలుసా ?

by Anji
Ad

అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అఖిల్ ఇప్పటివరకు నటించిన సినిమాలేవీ అంతగా  సక్సెస్ సాధించకపోవడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్  మంచి హైప్ క్రియేట్ చేసింది.  ఏప్రిల్ 28న థియేటర్లలో బుల్లెట్ల వర్షం కురువబోతుందని తుఫాన్ హెచ్చరిక జారీ చేసే అవకాశముంది. . ట్రైలర్ తో అంచనాలు పెరగడమే కాదు.. గేమ్స్ నుంచే ఏజెంట్ మూవీలో భారీ యాక్షన్ ఉంటాయని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ‘వైల్డ్ సాలె’ గా అఖిల్ చేసే యాక్షన్ సీక్వెన్స్ లో ఎప్పుడు చూడాలని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read :   కొడుకులు, కూతుళ్లు, మనవరాళ్లకి ప్రత్యేకమైన పేర్లు పెట్టిన ఎన్టీఆర్.. దీని వెనుక ఇంత కథ ఉందా ?

Advertisement

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లను కూడా పరుగులు పెట్టిస్తున్నాడు అఖిల్. ఇటీవలే వరంగల్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. అగ్రెసివ్ గా, టు ఆర్ డై అన్నట్టుగా ఏజెంట్ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు అఖిల్. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏజెంట్ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తున్నారు. ఈ సినిమా విడుదలకు రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో అఖిల్ కష్టానికి ఫలితం దక్కుతుందా లేదా అనే టెన్షన్ కొందరిలో నెలకొంది. ఎప్పుడైతే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమయ్యాయో అప్పటినుంచి ఏజెంట్ సినిమాపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి.

Advertisement

Also Read :  ఈ ఫేక్ యాక్సెంట్ అవ‌స‌ర‌మా…? స‌మంత పై నెటిజ‌న్ ల సెటైర్లు…!

ఏజెంట్ ఫ్రీ బుకింగ్స్ కు సాలిడ్ రెస్పాన్స్ వస్తున్నట్టు తెలుస్తుంది. అందుకు తగినట్టే ఈ సినిమా సెన్సార్ ట్రాక్ మాత్రం అదిరిపోయింది.. సెన్సార్ బోర్డు ఏజెంట్ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా రన్  టైం 2గంటల 36 నిమిషాలుగా లాక్ చేశారు. 2గంటల 40 నిమిషాల నిడివి ఉన్న సినిమాలు సూపర్ హిట్ అయిన హిస్టరీ టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. సెన్సార్ సభ్యులు కూడా  పాజిటివ్ రివ్యూ ఇచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా యాక్షన్ సీన్లు ఓ రేంజ్ లో ఉన్నాయి  అంటున్నారు సెన్సార్ వారు. కళ్యాణ్ రామ్ రవితేజ రామ్ చరణ్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలకి సూపర్ హిట్స్ అందించిన సురేందర్ రెడ్డి అఖిల్ కు ఎలాంటి ఎత్తు ఇస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Also Read :  Virupaksha: విరూపాక్ష దర్శక నిర్మాతలకు బిగ్ షాక్.. మరీ ఇంత దారుణమా..?

Visitors Are Also Reading