Home » ఈ ఫేక్ యాక్సెంట్ అవ‌స‌ర‌మా…? స‌మంత పై నెటిజ‌న్ ల సెటైర్లు…!

ఈ ఫేక్ యాక్సెంట్ అవ‌స‌ర‌మా…? స‌మంత పై నెటిజ‌న్ ల సెటైర్లు…!

by AJAY
Ad

అందాలతార స‌మంత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ కు ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. ఇండియాలోనే ఈ వెబ్ సిరీస్ నంబ‌ర్ వ‌న్ సిరీస్ గా నిలిచింది. ఇక సిరీస్ లో స‌మంత బోల్డ్ గా న‌టించి ఏకంగా బాలీవుడ్ ను త‌న వైపుకు తిప్పుకుంది. స‌మంత న‌ట‌న‌కు బాలీవుడ్ ప్రేక్ష‌కులు సైతం ఫిదా అయ్యారు. ఆ వెబ్ సిరీస్ కు రాజ్ అండ్ డీకే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Advertisement

ఇక ఇప్పుడు తాజాగా రాజ్ అండ్ డీకే సిటాడెల్ అనే మ‌రో స‌రికొత్త వెబ్ సిరీస్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. ఇక ఈ సిరీస్ లో కూడా స‌మంత ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో వ‌రుణ్ దావ‌న్ న‌టించాడు. కాగా ఈ వెబ్ సీరిస్ ప్రీమియ‌ర్స్ ను లండ‌న్ లో ప్ర‌ద‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో సిటాడెల్ టీమ్ లండ‌న్ లో సంద‌డి చేస్తోంది. ఇక స‌మంత ఇప్ప‌టికే త‌ను లండ‌న్ లో చిత్ర యూనిట్ తో చిల్ చేస్తున్న ఫోటోల‌ను షేర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

కాగా వెబ్ సిరీస్ ప్రీమియ‌ర్స్ కార్య‌క్ర‌మంలో స‌మంత మాట్లాడింది. అయితే స‌మంత కామ‌న్ గా కాకుండా కాస్త స్టైల్ గా ఇంగ్లీష్ లో మాట్లాడే ప్ర‌య‌త్నం చేసింది. దాంతో స‌మంత పై నెటిజ‌న్ లు ఫైర్ అవుతున్నారు. ఈ ఫేక్ యాక్సెంట్ అవ‌స‌ర‌మా అంటూ కామెంట్ లు పెడుతున్నారు. విదేశాల‌కు వెళ్లినంత మాత్రాన యాస‌మారిపోతుందా అని అడుగుతున్నారు. ఇక చైతూతో విడాకుల త‌ర‌వాత‌ స‌మంత త‌ర‌చూ ఏదో ఒక‌రకంగా వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే.

ALSO READ : నీ ముఖానికి హీరోయిన్ అవుతావా..? బ‌ల‌గం న‌టిని అంత‌లా అవ‌మానించారా..?

Visitors Are Also Reading