Telugu News » Blog » ఎన్టీఆర్ తో భారీ మూవీ నిర్మించబోతున్న బాలీవుడ్ నిర్మాత ఎవరో తెలుసా ?

ఎన్టీఆర్ తో భారీ మూవీ నిర్మించబోతున్న బాలీవుడ్ నిర్మాత ఎవరో తెలుసా ?

by Anji
Ads

రౌద్రం రణం రుధిరం (RRR) చిత్రంతో పాన్ ఇండియా మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. కొమురం భీమ్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి గ్లోబల్ స్టార్ గా గొప్పపేరు సంపాదించుకున్నాడు. ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్ భారీ లైనప్ సెట్ చేసేసుకున్నాడు. ఆర్ఆర్ఆర్ తరువాత టాలెంటేడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.  

Advertisement

Also Read :  మిస్ ఇండియా పోటీల్లో స్మృతి ఇరానీ ర్యాంప్ వాక్… వీడియో వైరల్

రెండు రోజుల కిందటే ఈ సినిమా అధికారికంగా పూజా కార్యక్రమం ప్రారంభమైంది. NTR30 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నాడు. ఈ చిత్రం 2024 ఏప్రిల్ 5న విడుదలవుతుండగా.. ఎన్టీఆర్ కి జోడీగా జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అతిత్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ తన 31వ సినిమాను ఎవరితో చేయబోతున్నారో ప్రకటించారు. ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమాను కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయనున్నట్టు ప్రకటించాడు. 

Advertisement

Also Read :   మొగుడి సుఖం కోసం నయనతార సంచలన నిర్ణయం…?

Popular Bollywood producer to make a film with Jr. NTR? | 123telugu.com

ఆ తరువాత బాలీవుడ్ బడా నిర్మాత ఎన్టీఆర్ తో ఓ సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యారని తాజాగా వినిపిస్తున్నటువంటి టాక్. ఆ నిర్మాత మరెవ్వరో కాదు. టీ సిరిస్ సంస్థ అధినేత భూషణ్ కుమార్. త్వరలోనే ఈయన ఎన్టీఆర్ తో భారీ పాన్ ఇండియన్ మూవీ నిర్మించనున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఎన్టీఆర్ 30 ప్రారంభోత్సవానికి టీ సిరీస్ అధినేత స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ముంబై నుంచి స్పెషల్ గా విచ్చేయడంతో ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సంస్థ ప్రభాస్, అల్లు అర్జున్ తో భారీ సినిమాలను సెట్ చేసుకోగా.. ఇప్పుడు ఎన్టీఆర్ తో కూడా లైనప్ చేసుకోవడం అభిమానుల్లో మంచి క్రేజీ న్యూస్ అయిందనే చెప్పాలి. ఎన్టీఆర్ తో ఆ బడా నిర్మాత సినిమా ఉంటుందో లేదో అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే. 

Advertisement

 Also Read :   కోలీవుడ్ స్టార్ హీరో తో మీనా రెండో పెళ్లి..?

You may also like