Home » తొలిప్రేమ మూవీలో నటించిన ఈ కమెడియన్ ఎవరు ? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..?

తొలిప్రేమ మూవీలో నటించిన ఈ కమెడియన్ ఎవరు ? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..?

by Anji
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో “తొలిప్రేమ” సినిమా చాలా ప్రత్యేకం అనే చెప్పాలి. కరుణాకరన్ అనే తమిళ కుర్రాడిని దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు పవన్ కళ్యాణ్. లవ్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా తరువాత చాలా రీరిలిజ్ అయింది. ఈ ఏడాదితో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇటీవలే 4కే క్వాలిటీ, డాల్బీ అట్మాస్ సౌండ్ తో రీరిలిజ్ చేశారు. రీ రిలీజ్ చేసిన ఈ మూవీ సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది.   ముఖ్యంగా పవన్-కీర్తి రెడ్డిల లవ్ ట్రాక్.. కెమెస్ట్రీ, కామెడీ, ఎమోషనల్ సీన్స్, సాంగ్స్ అన్ని చాలా అద్భుతమనే చెప్పాలి. ఇలా చెప్పుకుంటూపోతే సినిమాలో ప్రతీ అంశం హైలెట్ అనే చెప్పవచ్చు. 

Advertisement

ముఖ్యంగా  పవన్ అభిమానులకు కూడా తొలిప్రేమ మెమరబుల్ మూవీ. అలీ, వేణుమాధవ్ తో పాటు తదితరులు పవన్ కి ఫ్రెండ్స్ కనిపించారు. ఆ గ్యాంగ్ లో నల్లగా ఉండే బొగ్గు శ్రీను క్యారెక్టర్ చేసిన జగన్ బాగా పాపులర్ అయ్యాడు. అతను నటించిన ఒకే ఒక్క సినిమా ఇది కావడం విశేషం. ప్రారంభంలోనే ఏకంగా డీఎస్పీ కూతురుకి లవ్ లెటర్ ఇచ్చి.. వాళ్లు వచ్చి ఎక్కడ కొడతారోనని భయపడి దాక్కొవడం.. అమ్మాయి కూడా లవ్ చేస్తున్నట్టు చెప్పగానే సాంగ్ లీడ్ తనతోనే స్టార్ట్ అవ్వడం.. ఇలా మంచి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చాడు దర్శకుడు. ఇంతకు ఈ జగన్ ఎవరు అంటే దర్శకుడు కరుణాకరన్ కి బాగా కావాల్సిన వ్యక్తి అంట. 

Advertisement

చెన్నైలో తాను సినిమా ప్రయత్నాల్లో ఉండగా.. జగన్ సాయం చేశాడట. అప్పుడే తను డైరెక్టర్ అయితే ఫస్ట్ మూవీలో ఛాన్స్ ఇస్తానని చెప్పాడట. ఇచ్చిన మాట ప్రకారమే.. తొలిప్రేమలో మంచి వేషం ఇచ్చాడట. ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చినప్పటికీ జగన్ ఆ తరువాత ఏ సినిమాలో కూడా నటించలేదు. తాను మద్రాస్ లోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. సినిమాల్లో కమెడీయన్ గా స్టార్డమ్ తెచ్చుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆయన తన ఉద్యోగానికే ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. తమిళనాడు వ్యక్తి అయినప్పటికీ.. తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కరుణాకరన్. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

ఛార్మి రెమ్యూనరేషన్ తీసుకొని ప్రమోషన్స్ కి ఎగ్గొట్టాలని చూసింది.. జయసుధ న్యాయం చేసింది..!

వరుణ్ సందేశ్ భార్య వితికా షేర్ యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

Visitors Are Also Reading