సాధారణంగా కొంత మందికి ప్రత్యేకమైనటువంటి ఆహారం, పానియాలు తీసుకోవడం చాలా ఇష్టం. వాళ్లు ఎక్కడికి వెళ్లినా కొత్త రకాల వంటలను రుచి చూడాలని ఇష్టపడుతుంటారు. దేశంలో అయినా, ప్రపంచంలో అయినా కొత్త వంటకాలను టేస్ట్ చేయడమే వారి పని. ఈ ప్రపంచంలో కొన్ని వంటకాల పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. కొంతమంది వాటిని తినే ముందు ఒకటికి వందసార్లు ఆలోచిస్తుంటారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Fried Taruntula Spider :
సాధారణంగా చిరుతిల్లుగా పకోడి, చిప్స్, బజ్జీ, మెమోస్, సమోసాలు వంటివి తింటుంటారు. కాంబోడియా ప్రజలు ప్రత్యేకంగా స్నాక్స్ తినడానికి ఆసక్తి చూపుతారు. వాళ్లు వేయించిన తరంతులా సాలీడుని తింటారు. అది చాలా టేస్టీగా ఉంటుందని చెబుతుంటారు.
Also Read : చిరంజీవి, రాజశేఖర్ మధ్య గొడవలు..14 ఏళ్ళ కిందట ఏమైంది?
Poisonous Fish :
జపాన్ లో పఫర్ ఫిష్ డిష్ లేదా ఫుగు అనే విషపూరిత చేపను చాలా ఉత్సాహంగా తింటారు. ఈ చేప సైనైడ్ కంటే 1250 రెట్లు ఎక్కువగా విషపూరితమైంది. జపాన్ లోని కొంతమంది చెఫ్ లు మాత్రమే విషపూరితమైన ఈ చేపల నుంచి విషాన్ని తొలగించి.. వంటలు తయారు చేయడానికి లైసెన్స్ పొందారు. ఈ చేపలు తినాలనుకునే వారికి ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తారు.
Luwak Coffee :
చాలా మంది తప్పనిసరిగ్గా చల్లని లేదా వేడీ కాపీ తాగుతుంటారు. ఆ కాఫీల రుచి మీకు కూడా నచ్చుతుంది. కానీ కొన్ని కాఫీ గింజలను జంతువుల విసర్జన నుంచి సేకరిస్తారని విషయం మీకు తెలుసా..? లువాక్ పిల్లి.. ఈ కాఫీ గింజలను మింగుతుంది. కడుపులో అరగవు. తిరిగి విసర్జన ద్వారా బయటికి వచ్చేస్తాయి. ఆ గింజలను సేకరించి.. ఇండోనేషియా కాఫీ తయారు చేస్తారు. ఈ కాఫీ రుచికి చాలా బాగుంటుందని తాగిన వారు చెప్పడం విశేషం.
Also Read : ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ పుజారాకు ఎందుకు..? శ్రేయస్ అయ్యర్ కి ఇవ్వొచ్చు కదా..!
Sankaji Live Octopus :
కొరియాలో బతికి ఉన్న ఆక్టోపస్ తో వంట తయారుచేస్తారు. దీనిని సాధారణంగా సంకాజీ అని పిలుస్తారు. దీని కోసం ఆక్టోపస్ ని ముక్కలుగా కట్ చేసి నువ్వుల నూనెలో కొద్దిగా వేయించి.. వెంటనే తినడానికి వడ్డిస్తారు. కొన్ని సార్లు ఆక్టోపస్ కాళ్లు ప్లేట్ లో కదులుతుంటాయి. ఈ వంటకం చాలా ప్రమాదకరమైందిగా గుర్తింపు పొందింది. మరణం కూడా సంభవించే ప్రమాదముందని ప్రచారం జరుగుతుంది.
Also Read : Balli Sastram in Telugu: మన శరీరంలో ఏయే భాగాలలో బల్లి పడితే ఎలాంటి ఫలితాలుంటాయో మీకు తెలుసా..?