Home » మీరు ఫోన్ ని ఎక్కువ బ్రైట్ నెస్ తో వాడుతున్నారా..? అయితే ఆ ప్రమాదం తప్పదు..!

మీరు ఫోన్ ని ఎక్కువ బ్రైట్ నెస్ తో వాడుతున్నారా..? అయితే ఆ ప్రమాదం తప్పదు..!

by Anji

ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం సర్వ సాధారణం అయిపోయింది. ఉదయం నిద్ర లేవగానే తొలుత ఫోన్ ని చేతిలో పట్టుకుంటారు. లేచి నప్పటి నుంచి మళ్లీ రాత్రి నిద్రపోయేంత వరకు ఫోన్ తోనే గడుపుతుంటారు. స్మార్ట్ ఫోన్లలో రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. అదేవిధంగా దుష్ఫ్రాభావాలు కూడా ఉన్నాయి. 

ముఖ్యంగా అతిగా స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించినట్టయితే జరిగే నష్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ కారణంగా కళ్లలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. దీర్ఘకాలంగా ఇలాగే కొనసాగితే కంటి చూపు కూడా పోయే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. అదేవిధంగా ఓవర్ బ్రైట్ నెస్ కేవలం కంటి ఆరోగ్యంపై మాత్రమే కాదు.. ఫోన్ పనితీరుపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎక్కువ బ్రైట్ నెస్ కారణంగా ఫోన్ ఛార్జింగ్ త్వరగా డిశ్చార్జ్ అవుతుంది. దీంతో ఫోన్ బ్యాటరీ లైఫ్ పై ప్రభావం చూపుతుంది. బ్రైట్ నెస్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రాసెసర్ పై ఒత్తిడి పడుతుంది. ఫోన్ హ్యాంగ్ కావడం ప్రారంభమవుతుంది. ప్రాసెసర్ పై ఒత్తిడి పెరిగి ఫోన్ పని తీరు తగ్గిపోతుంది. 

Also Read :   శబరిమలలో పరశురాముడు నిర్మించిన మెట్లు పంచలోహ మెట్లుగా ఎలా మారాయో తెలుసా ?

Manam News

ఫోన్ బ్రైట్ నెస్ మరీ ఎక్కువగా ఉండడంతో అది డిస్ ప్లే పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. సాధారణంగా బ్రైట్ నెస్ ఎక్కువగా ఉంటే హీట్ జనరేట్ అవుతుంది. దీంతో ఇది డిస్ ప్లే పని తీరుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి వీలు అయినంత వరకు బ్రైట్ నెస్ ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం ఉత్తమం అని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా డార్క్ మోడ్ ని ఉపయోగిస్తే చాలా బెటర్ అని కూడా చెబుతున్నారు. మరీ ఇంకెందుకు ఆలస్యం మీ ఫోన్ లో బ్రైట్ నెస్ ని తగ్గించి.. మీ కళ్లను, ఫోన్ ను కాపాడుకోండి. 

 Also Read :  Balli Sastram in Telugu: మన శరీరంలో ఏయే భాగాలలో బల్లి పడితే ఎలాంటి ఫలితాలుంటాయో మీకు తెలుసా..?

Visitors Are Also Reading