Home » ప్రాజెక్ట్ K లో ప్రభాస్ డబుల్ యాక్షన్ చేయనున్నాడా..? దాని అర్థం అదేనా ?

ప్రాజెక్ట్ K లో ప్రభాస్ డబుల్ యాక్షన్ చేయనున్నాడా..? దాని అర్థం అదేనా ?

by Anji
Ad

టాలీవుడ్ లో మోస్ట్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్స్ లలో ఒకటిగా తెరకెక్కుతున్న మూవీ “ప్రాజెక్ట్ కే”. ఈ చిత్రంపై కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు.  అప్పటి నుంచి ప్రభాస్ సినిమాలకు ఇండియాతో పాటు ప్రపంచ దేశాల్లో కూడా మంచి క్రేజ్ నెలకొంది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు. 

Advertisement

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏంటంటే.. ఈ మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. వీటిలో ఒకటి నెగిటివ్ రోల్ ఉంటుందని పేర్కొంటున్నారు. ఇప్పటివరకు పెద్దగా ఆ న్యూస్ పై నమ్మకం లేకపోయినప్పటికీ నిన్న మేకర్స్ విడుదల చేసిన ఓ పోస్టర్ ద్వారా ఆ డౌట్ కాస్త బలపడింది. ముఖ్యంగా ఈ పోస్టర్ లో రెండు చేతులు చూపిస్తూ.. ఆ చేతులు ఒకదానికొకటి ఢీ కొంటున్నట్టు డిజైన్ చేశారు. దీనిని బట్టి ప్రభాస్ హీరోగా, విలన్ గా రెండు తానే చేస్తున్నట్టు పేర్కొంటున్నారు. మరోవైపు తాజాగా ఓ తెల్ల పేపర్ పై రెండు పువ్వులు ఉన్న ఫొటోను షేర్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. దీనిని బట్టి చూస్తుంటే ఈ పువ్వుల్లోనే ఈ సినిమా యొక్క టైటిల్ అర్థం ఉందని తెలుస్తోంది. మరో 5 రోజుల్లో దీనిని అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం. 

Advertisement

ముఖ్యంగా ఓ పోస్టర్ లో రెండు చేతులు చూపిస్తూ.. ఆ చేతులు ఒకదానికొకటి ఢీ కొంటున్నట్టు డిజైన్ చేశారు. దీనిని బట్టి ప్రభాస్ హీరోగా, విలన్ గా రెండు పాత్రలను తానే చేస్తున్నట్టు పేర్కొంటున్నారు. ఆ పాత్రలో హీరో వైపు అమితాబ్ పాత్ర ఉంటే.. విలన్ వైపు కమల్ హాసన్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. కొందరూ ఏంటి అంటే రిలీజ్ చేసిన పోస్టర్ లో ఏదో ఒక చేయి అమితాబ్ ది అయి ఉండవచ్చని పేర్కొంటున్నారు. దీని గురించి క్లారిటీ రావాలంటే.. జులై 20న విడుదలవుతున్న ప్రాజెక్ట్ కే గ్లింప్స్ చూస్తే కానీ తెలియదు. ఈ చిత్రంలో దీపికా పదుకునే, దిశా పఠాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరిలో కూడా ఒకరూ నెగిటివ్ రోల్ చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. అప్పటివరకు వేచి చూద్దాం. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 భారత దేశంలోనే ప్రప్రథమంగా ఈ పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత కాంగ్రెస్ ది !

Visitors Are Also Reading