భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దేశభక్తి ఉప్పొంగుతున్న వేళ తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఒక గ్రామంలో మహాత్మగాంధీ ఆలయానికి పాదయాత్రలు గణనీయంగా పెరిగాయి. ఆయన దర్శనం కోసం గ్రామస్తులు తరలివస్తున్నారు. తెలంగాణలోని చిట్కాల పట్టణం చుట్టుపక్కల ఉన్న చాలా మందికి హైదరాబాద్ నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాత్మగాంధీ ఆలయాన్ని సందర్శించడం ఒక సెంటిమెంట్ గా మారుతోంది.
నల్గొండ జిల్లా చిట్యాట్ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి పెద్దకాపర్తి గ్రామంలో తొలిసారిగా నిర్మించిన దేవాలయం సుదూర ప్రాంతాల నుంచి కూడా దృష్టిని ఆకర్షిస్తోందని మందిరాన్ని నిర్వహిస్తున్న మహాత్మగాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి పీవీ కృష్ణరావు వెల్లడించారు. సాధారణంగా నిత్యం 60 నుంచి 70 మంది ప్రజలు ఈ దేవాలయంలో ప్రార్థనలు చేయడానికి వస్తుంటారు. ఇప్పుడు భారత ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ తెలంగాణ ప్రభుత్వ స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల పేరుతో విస్తృత ప్రచారం చేయడంతో రోజుకు 300 నుంచి 340 మంది సందర్శకుల సంఖ్య పెరిగిందని ఆయన పేర్కొన్నారు. 2014లో నిర్మించిన ఆలయంలో ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ అక్టోబర్ 02న గాంధీజయంతి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
Advertisement
Advertisement
ప్రజలు ప్రతి రోజు వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేయడంతో ఆలయం నెమ్మదిగా ప్రాధాన్యత సంతరించుకుంటుందని తెలిపారు. హైదరాబాద్-విజయవాడ హైవేకి సమీపంలో నాలుగు ఎకరాల స్థలంలో నిర్మించబడిన ఆలయంలో మహాత్ముడు కూర్చున్న భంగిమలో ప్రజలకు ఆశీస్సులు అందజేస్తున్నారు. ఇక ఆ గ్రామస్తులు ఎవరైనా వివాహ ఆహ్వాన పత్రాలను పంపిణీ చేసే ముందు పూజలు చేసి బాపు ఆశీస్సులు తీసుకోవడం ఇప్పుడు కొత్త సంప్రదాయంగా మారింది. గాంధీజీని కేవలం స్వాతంత్య్ర పోరాటానికే పరిమితం చేయడం లేదని కృష్ణారావు తెలిపారు. మేము అతన్ని మహాత్ముడుగా కాకుండా మహితాత్ముడు గా చూస్తామని చెప్పాడు. తెలంగాణ పర్యాటక శాఖ ఈ ఆలయాన్ని రాష్ట్రంలోని దివ్య గమ్యస్థానాల్లో ఒకటిగా చేర్చింది. ఆలయ ట్రస్ట్ మద్యం, మాంసాహారం తినడం నిషేదించబడిన, కులాంతర వివాహాల కోసం నామమాత్రపు దరతో ప్రాంగణంలో ఉన్న కళ్యాణ మండపాన్ని అందిస్తోంది.
Also Read :
దయచేసి మా సినిమాను బహిష్కరించకండి.. చేతులు జోడించి మరీ వేడుకున్న ఆ స్టార్ హీరోయిన్..!
ఆ స్టార్ హీరో, హీరోయిన్ మంచి స్నేహితులు..కానీ విధి వారిపై పగపట్టింది..దాంతో చివరికి..!!