Telugu News » Blog » ద‌య‌చేసి మా సినిమాను బ‌హిష్క‌రించ‌కండి.. చేతులు జోడించి మ‌రీ వేడుకున్న ఆ స్టార్ హీరోయిన్‌..!

ద‌య‌చేసి మా సినిమాను బ‌హిష్క‌రించ‌కండి.. చేతులు జోడించి మ‌రీ వేడుకున్న ఆ స్టార్ హీరోయిన్‌..!

by Anji
Ads

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన లాల్ సింగ్ చ‌డ్డా ఆగ‌స్టు 11న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం విధిత‌మే. ద‌ర్శ‌కుడు అద్వైత్ చంద‌న్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తోంది. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో వ‌సూళ్ల‌ను రాబట్ట‌లేక‌పోయింది. ఈ సినిమా విడుద‌ల తేదీ అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి బాయ్ కాట్ లాల్ సింగ్ చ‌డ్డా ట్యాగ్ లైన్ ట్రెండ్ అవుతోంది.

Ads


ఇక ఈ చిత్రాన్ని ఎవ్వ‌రూ చూడ‌వద్ద‌ని బ‌హిష్క‌రించాలంటూ సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. దీంతో లాల్ సింగ్ చ‌డ్డా క‌లెక్ష‌న్స్ త‌గ్గిపోయాయి. తాజాగా ఈ చిత్రంపై వ‌స్తున్న నెగిటివ్ ప్ర‌చారం గురించి హీరోయిన్ క‌రీనా క‌పూర్ స్పందించారు. ఆమె ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో క‌రీనా మాట్లాడారు. సోష‌ల్ మీడియాలో కొంద‌రూ మాత్ర‌మే కావాల‌ని సినిమాను ట్రోల్ చేస్తున్నారు. కానీ ప్రేక్ష‌కుల నుంచి వ‌స్తున్న స్పంద‌న మ‌రో విధంగా ఉంది.

Ads

కేవ‌లం టార్గెట్ చేసి ఈ సినిమాపై నెగిటివ్ ప్ర‌చారం చేస్తున్నారు. ఇది ఒక అద్భుత‌మైన చిత్రం. క‌చ్చితంగా ఈ చిత్రాన్ని తెర‌పై చూడాలి. దాదాపు మూడు సంవ‌త్స‌రాల నుంచి ఈ చిత్రాన్ని తెర‌పై చూడాల‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. నెగిటివ్ ప్ర‌చారం చూసి మంచి సిన‌మాను బ‌హిష్క‌రించ‌వ‌ద్దు.. రెండున్న‌ర సంవ‌త్స‌రాల‌కు పైగా దాదాపు 250 మంది ఈ సినిమా కోసం ప‌ని చేశారు. ద‌య‌చేసి ఈ చిత్రాన్ని బ‌హిష్క‌రించ‌కండి అంటూ విజ్ఞ‌ప్తి చేసింది. తొలిరోజు సినిమా బాక్సాపీస్ వ‌ద్ద రూ.11.50 కోట్లు వ‌సూలు చేసింది. హాలీవుడ్ సూప‌ర్ హిట్ రీమెక్ ఫారెస్ట్ గంప్ కు రీమేక్ గా లాల్ సింగ్ చ‌డ్డా చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా అక్కినేని నాగ‌చైత‌న్య కీల‌క‌పాత్ర‌లో న‌టించారు.

Also Read : 

Ad

Jr NTR: ఆస్కార్ బ‌రిలో ఎన్టీఆర్.. హాలీవుడ్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌..!