Home » పొర‌పాటున కూడా కాబోయే భార్య‌తో ఈ విష‌యాలు చ‌ర్చించ‌కండి..!

పొర‌పాటున కూడా కాబోయే భార్య‌తో ఈ విష‌యాలు చ‌ర్చించ‌కండి..!

by Anji
Published: Last Updated on
Ad

పెళ్లికి ముందు చాలా మంది త‌మ‌కి సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని కాబోయే భాగ‌స్వామితో చ‌ర్చిస్తున్నారు. ఇక పూర్వ‌కాలంలో అయితే అలాంటివి అస్స‌లు ఉండేవి కాద‌ట‌. కొన్ని సంద‌ర్భాల్లో పెళ్లి జ‌రిగే వ‌ర‌కు కూడా ఒక‌రినొక‌రు చూసుకునే వారు కాద‌ట‌. చాలా వ‌ర‌కు కాబోయే భార్య‌, భ‌ర్త‌లు ప‌లు విష‌యాల‌ను చ‌ర్చించుకోవ‌డం ద్వారా బంధం బ‌ల‌ప‌డుతుంద‌ని వారు భావిస్తారు. ఒక్కోసారి ఇది రివ‌ర్స్ కూడా అవుతుంది. అప్ప‌టికి ఒక‌రినొక‌రికి ప‌రిచ‌యం త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల కూడా ఇలా జ‌రుగుతుంది. ముఖ్యంగా వ్య‌క్తి గ‌త విష‌యాలు చ‌ర్చించ‌డం మంచిది కాదు. పెళ్లికి ముందు ఎలాంటి విష‌యాలు చ‌ర్చించ‌కూడ‌దో తెలుసుకుందాం.

Advertisement

ముఖ్యంగా అబ్బాయి అయినా అమ్మాయి సంబంధంలోకి వ‌చ్చిన త‌రువాత కొంత స‌మ‌యం వ‌ర‌కు మీ బ‌ల‌హీన‌త‌ల గురించి అస‌లు చెప్ప‌కండి. ఎందుకంటే మీ భాగ‌స్వామి దీనిని అడ్డుపెట్టుకుని మిమ్మ‌ల్ని వేధించి అవ‌కాశాలుంటాయి. మొద‌ట మీ భాగ‌స్వామి అర్థం చేసుకోండి. కొద్ది రోజులు గ‌డిచిన త‌రువాత ఇలాంటి విష‌యాల గురించి ప్ర‌స్తావించ‌కండి.

Advertisement

కొంత‌మంది అబ్బాయిలు చాలా ఎమోష‌న‌ల్ గా ఉంటారు. వారి జీవితంలో అడుగుపెట్టిన భాగ‌స్వామికి వెంటనే త‌మ జీవితం గురించి చెబుతారు. జీవితంలో ఎదుర్కొన్న అవ‌మానాల గురించి ప్ర‌స్తావించారు. ఇలా చేయ‌డం వ‌ల్ల మీపై గౌర‌వం త‌గ్గే అవ‌కాశాలుంటాయి. కొద్ది రోజుల త‌రువాత చెబితే అర్థం చేసుకునే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇలాంటి విష‌యాల‌ను త్వ‌ర‌గా చ‌ర్చించ‌డం మంచిది కాదు.


కుటుంబం అనేది మ‌నంద‌రి జీవితాల‌తో ఒక ముఖ్య‌మైన భాగం. కుటుంబ గౌర‌వం కాపాడ‌డం మ‌న‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. మీరు కొత్త బంధంలోకి ప్ర‌వేశించిన‌ప్పుడు కుటుంబ ర‌హ‌స్యాల‌ను మీ ప్రియుడు లేదా స్నేహితురాలితో షేర్ చేసుకోకూడదు. ఎందుకు అంటే మీరు చెప్పే ర‌హ‌స్యాల మూలంగా బ్లాక్ మెయిల్ చేసే అవ‌కాశాలుంటాయి. దీనివ‌ల్ల బందం చెడిపోయే ప్ర‌మాద‌ముంటుంది.

Also Read : 

కార్తీక దీపం సీరియ‌ల్‌లో వంట‌ల‌క్క‌, డాక్ట‌ర్ బాబు రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నారా..?

నేరేడుపండును వారు అస‌లు తిన‌కూడ‌ద‌ట‌..!

Visitors Are Also Reading