Home » కార్తీక దీపం సీరియ‌ల్‌లో వంట‌ల‌క్క‌, డాక్ట‌ర్ బాబు రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నారా..?

కార్తీక దీపం సీరియ‌ల్‌లో వంట‌ల‌క్క‌, డాక్ట‌ర్ బాబు రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నారా..?

by Anji
Ad

సాయంత్రం అయిందంటే ఎంతో మంది ఎంతో ఆస‌క్తిక‌రంగా కొన‌సాగుతున్న కార్తీక దీపం సీరియ‌ల్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఆ సీరియ‌ల్ ప్ర‌త్యేక‌త గురింఇ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఈ సీరియ‌ల్ ద్వారా దీప కార్తీక్ పాత్ర‌ల్లో ప్రేమి విశ్వ‌నాథ్‌, నిరుప‌మ్ ఎంతో అద్భుతంగా న‌టించార‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే ఒక రోడ్డు యాక్సిడెంట్ స‌న్నివేశంలో దీప, కార్తీక్ ఇద్ద‌రూ చ‌నిపోయిన‌ట్టు చూపించారు. వీరిద్ద‌రి పాత్ర‌ల‌ను సీరియ‌ల్‌నుంచి తొల‌గించ‌డంతో ఎంతో మంది అభిమానులు నిరాశ వ్య‌క్తం చేస్తున్నారు. చిన్న‌ప్ప‌టి హిమ పెద్ద అయి ప్ర‌స్తుతం వీరితోనే క‌థ మొత్తం న‌డిపిస్తున్నారు.

Advertisement

ఇక దీప కార్తీక్ లేక‌పోవ‌డంతో చాలా మంది సీరియ‌ల్ చూడ‌డానికి ఇష్ట‌ప‌డ‌డం లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. సీరియ‌ల్‌కి దీప కార్తీక్ రీ ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది. కార్తీక్ దీప లోయ‌లో ప‌డి ఆ ప్ర‌మాదంలో చ‌నిపోలేద‌ని ఆ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డి వీరిద్ద‌రూ మాన‌సిక స్థితి కోల్పోయి ఉంటార‌ట‌. మంగ‌ళూరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉంటార‌ట‌. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రూ వారి పిల్ల‌ల‌ను క‌లుసుకోబోతున్నారని స‌మాచారం. జ్వాల ద‌గ్గ‌ర ఉన్న చంద్ర‌మ్మ‌, ఇంద్రుడు ఓ ప‌ని నిమిత్తం సొంత ఊరికి వెళ్ల‌గా అక్క‌డ వీరికి దీప కార్తీక్ తార‌స‌ప‌డుతారు.

Advertisement


ఇలా చంద్ర‌మ్మ‌, ఇంద్రుడు వీరిని చూడ‌గా క‌థ మొత్తం అడ్డం తిరిగి చివ‌రికి వారి సాయంతో దీప కార్తీక్ త‌మ సొంత ఇంటికి చేరుకుంటారు. ఇదే స‌మ‌యంలో మోనిత కూడా రీ ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం మోనిత కొడుకు ఆనంద్ ఇప్ప‌టికే హిమ ద‌గ్గ‌ర ఉన్నారు. మోనిత కూడా ఆనంద్ కోసం, డాక్ట‌ర్ బాబు కోసం ఆ కుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చి యధావిధిగా కార్తీక‌దీప‌ను విడ‌గొట్ట‌డానికి ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని సోష‌ల్ మీడియాలో వార్తలు వైర‌ల్ అయ్యాయి. వాస్త‌వంగానే కార్తీక దీపం సీరియల్ లోకి దీప కార్తీక్ రీ ఎంట్రీ ఇస్తే రేటింగ్స్ అమాంతం పెరిగిపోతాయ‌నే చెప్ప‌క‌నే చెప్పొచ్చు.

Also Read : 

నేరేడుపండును వారు అస‌లు తిన‌కూడ‌ద‌ట‌..!

ఆ స్టార్ హీరో ని మించేలా ఎన్టీఆర్ సత్తాను చూపించబోతున్న డైరెక్టర్..!!

 

Visitors Are Also Reading