Home » విమానాల్లో వెళ్ళేటప్పుడు ఈ వస్తువులని.. అస్సలు తీసికెళ్ళకండి..!

విమానాల్లో వెళ్ళేటప్పుడు ఈ వస్తువులని.. అస్సలు తీసికెళ్ళకండి..!

by Sravya
Ad

చాలా మంది ఫ్లైట్లో ప్రయాణం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఫ్లైట్లో ట్రావెల్ చేయడం వలన సులభంగా మనం మన గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. కొన్ని గంటల్లోనే మనం మన గమ్యస్థానానికి చేరుకోవచ్చు. సమయం కూడా వృధా కాదు. తేలికగా ప్రయాణం చేయొచ్చు. అయితే ఫ్లైట్లో వెళ్ళినప్పుడు పొరపాటున కూడా ఈ వస్తువులను తీసుకువెళ్లకూడదు. వీటిని తీసుకెళ్లడం ప్రమాదం. ఇటువంటి వస్తువులను తీసుకువెళ్లడం వలన కొన్ని కొన్ని సార్లు ప్రయాణికులని ప్రయాణం చేయడానికి కూడా అనుమతించరు. కాబట్టి ఎటువంటి వాటిని మనం ఫ్లైట్లో వెళ్లినప్పుడు తీసుకు వెళ్ళకూడదు అనే విషయాన్ని చూద్దాం.

Advertisement

Advertisement

ఫ్లైట్లో వెళ్లినప్పుడు పవర్ బ్యాంకులు, కత్తి, కత్తెర వంటి పదునైన పరికరాలు తీసుకువెళ్లకూడదు. అలానే డ్రై సెల్ బ్యాటరీలు కూడా తీసుకు వెళ్ళకూడదు. మందుగుండు సామాన్లు, బొమ్మ తుపాకీలని, స్విచ్ ఆఫ్ చేయలేని ఎలక్ట్రానిక్ పరికరాలని తీసుకెళ్లకూడదు. ఇటువంటివి అసలు ఎయిర్ పోర్ట్ లో అనుమతించరు. ఎరోసెల్స్ లిక్విడ్లు చట్ట ప్రకారం భద్రత ముప్పుగా పరిగణిస్తారు కాబట్టి ఇటువంటి వాటిని అస్సలు తీసుకువెళ్లకండి. పవర్ బ్యాంక్స్ లో లిథియం అయాన్ బ్యాటరీస్ ఉంటాయి. వీటిని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రాణాంతకంగా పరిగణిస్తుంది. అయితే ఇటువంటి వాటిని సరిగా ఉంచకపోతే అవి పేలే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిని అసలు తీసుకు వెళ్ళకండి.

Also read:

Visitors Are Also Reading