Home » ఇలా చేస్తే.. హ్యాంగోవర్ నుండి ఈజీగా బయటపడచ్చు…!

ఇలా చేస్తే.. హ్యాంగోవర్ నుండి ఈజీగా బయటపడచ్చు…!

by Sravya
Ad

హ్యాంగ్ ఓవర్ వలన చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. హ్యాంగ్ ఓవర్ నుండి బయట పడాలంటే కొంచెం టైం పడుతుంది. హ్యాంగోవర్ సమస్య పెద్ద ఇబ్బంది. తలనొప్పి, వికారం, వాంతులు వంటివి కలుగుతూ ఉంటాయి. దాని నుండి బయట పడాలంటే, అరటి పండ్లను తీసుకోండి. అరటి పండ్లని తీసుకోవడం వలన హ్యాంగ్ ఓవర్ నుండి త్వరగా బయటపడడానికి అవుతుంది. ఎలక్ట్రోలైట్స్ ని బాడీ ఆల్కహాల్ కారణంగా కోల్పోతుంది. కానీ అరటి పండ్లను తీసుకుంటే, తిరిగి మళ్ళీ పొందొచ్చు.

Advertisement

Advertisement

ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే కూడా త్వరగా బయటపడొచ్చు. ఉప్పు నీళ్లు లేదా ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోండి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను కూడా తీసుకోవడం మంచిది. ఆల్కహాల్ తీసుకోవడం వలన బాడీ తొందరగా డిహైడ్రేట్ అవుతుంది. దానివలన ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి నీళ్లు కూడా ఎక్కువ తీసుకోండి. నీళ్లతో పాటుగా ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉండే లిక్విడ్స్ ని తీసుకోండి. కోడిగుడ్లు తీసుకుంటే కూడా హ్యాంగ్ ఓవర్ తగ్గుతుంది. టీ, కాఫీ ని కూడా హ్యాంగ్ ఓవర్ తో బాధపడే వాళ్ళు తీసుకోవచ్చు. కాఫీలో కెఫిన్ తలనొప్పిని బాగా తగ్గిస్తుంది. ఇలా హ్యాంగ్ ఓవర్ నుండి సులభంగా బయటపడొచ్చు.

Also read:

Visitors Are Also Reading