Home » అల్లు అరవింద్ బాటలో దిల్ రాజు.. సక్సెస్ అయ్యేనా ?

అల్లు అరవింద్ బాటలో దిల్ రాజు.. సక్సెస్ అయ్యేనా ?

by Anji
Ad

సాధారణంగా హిట్ సినిమా ఎక్కడ ఉన్నా సరే దానిని రీమేక్ చేస్తుండేవారు తెలుగు దర్శక, నిర్మాతలు. కానీ ప్రస్తుతం ఒరిజినల్ మిస్ కాకుండా ఉండేందుకు దానిని డబ్బింగ్ చేసి తెలుగులో అలాగే విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు ఈ విషయం పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. 

Advertisement

అల్లు అరవింద్ ఈ మధ్య కాలంలో తీసిన సినిమాలు ఆశించిన మేరకు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. కానీ గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ 2లో వచ్చిన ఊర్వశివే రాక్షసివే సినిమా కాస్త పాజిటివ్ టాక్ నే తెచ్చుకుంది. అయినప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం వెనుకబడిందనే చెప్పాలి. దిల్ రాజు కూడా నేరుగా చేసిన సినిమాలు థాంక్యూ, రౌడీ బాయ్స్, జాను వంటి సినిమాలు ఒక రకంగా ప్లాప్ టాక్ తెచ్చుకున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ సేఫ్ సైడ్ గా ఉండేందుకు ఇతర భాషల సినిమాలన తెలుగు డబ్బింగ్ చేస్తున్నారు. అల్లు అరవింద్ ఇటీవలే కాంతారా సినిమాని తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ సినిమాతో మంచి లాభాలను అందుకున్నారు అల్లు అరవింద్. మరోవైపు దిల్ రాజు కేజీఎఫ్ చాప్టర్ , బీస్ట్, పొన్నియన్ సెల్వన్ 1 వంటి సినిమాలను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశారు దిల్ రాజు. 

Advertisement

Also Read :  NTR సలహాని పట్టించుకోని రేలంగి.. పాటించి ఉంటే మాత్రం ఈరోజు మరోలా ఉండేది..!!

తాజాగా మరో తమిళ సూపర్ హిట్ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు దిల్ రాజు. నవంబర్ 04న తమిళనాడులో విడుదలైన లవ్ టుడే సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. చిన్న బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా.. ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో నవంబర్ 18న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు దిల్ రాజు. మరోవైపు అల్లు అరవింద్ కూడా హిందీలో రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ భేడియా అనే సినిమాను తెలుగులో తోడేలు పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ ధావన్ కఈతి సనన్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలు తెలుగులో విజయం సాధిస్తాయో లేదో వేచి చూడాలి మరి.   

Also Read :  సమంత నటించిన యశోధ సినిమాకు ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా ?

Visitors Are Also Reading