Home » సమంత నటించిన యశోధ సినిమాకు ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా ?

సమంత నటించిన యశోధ సినిమాకు ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు సమంత. ఆ తరువాత వెంటనే తన భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఆమె పేరు మారు మ్రోగుతుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోవడానికి గల కారణాలు ఏమిటని ఇప్పటికీ కూడా చాలా మంది తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు నెటిజన్లు. దీంతో ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసే ప్రతీ పోస్ట్ ను ఆసక్తితో చూస్తున్నారు.

Advertisement

సమంత షేర్ చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి.  కొద్ది రోజులుగా వరుస చిత్రాలతో బిజీగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మయోసైటిస్ అనే వ్యాధితో ఇబ్బందిపడుతున్నట్ట ప్రకటించింది. సమంత నటించిన చిత్రాలలో యశోధ ఒకటి. నవంబర్ 11న  ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదల కానుంది. ప్రస్తుతం ప్రమోషన్లను వేగవంతం చేసింది చిత్ర  యూనిట్. యశోద సినిమా బడ్జెట్ గురించి సోషల్ మీడియాలో ఇప్పుడ ఓ వార్త వైరల్ అవుతోంది. యశోద సినిమాను ఇనిఫియల్ స్టేజ్ లో కేవలం రూ.3కోట్ల బడ్జెట్ తో పూర్తి చేయాలని నిర్మాతలు, దర్శకుడు అనుకున్నారట.  

Advertisement

Also Read :  ఒక్క అడుగు కూడా వేయ‌లేనేమో అనిపిస్తుంది…ఇంట‌ర్వ్యూలో క‌న్నీళ్లు పెట్టుకున్న సమంత‌..!

కానీ  ఈ స్టోరీ సమంత కి నచ్చి తాను చేయడానికి ఫిక్స్ అవ్వడంతో సినిమాను పాన్ ఇండియా రేంజ్ కు తీసుకెళ్లాలని ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ ఫిక్స్ అయ్యారట. తనకు కూడా సరోగసి స్కామ్ త్రూ అవుట్ ఇండియా సేలబుల్ పాయింట్ మాదిరిగా అనిపించడంతో ఈ సినిమాను దాదాపు రూ.40 కోట్లు ఖర్చు పెట్టారట. అంతేకాదు.. ఈ సినిమాను అందరికీ రీచ్ కావాలనే ఉద్దేశంతో భారీ స్కేల్ రూపొందించినట్టు తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఒక సినిమా రూ.10 కోట్లు బ్రేక్ ఈవెన్ సాధించడమే కష్టంగా ఉంది. అలాంటిది యశోద సినిమా కోసం రూ.40కోట్ల బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అని ప్రేక్షకులు భావిస్తున్నారు. సినిమా కలెక్షన్లు అనేది కంటెంట్, స్క్రీన్ ప్లే ఆధారపడి ఉంటాయంటున్నారు సినీ విశ్లేషకులు.  మొత్తానికి దాదాపు రూ.40 కోట్ల వరకు ఖర్చు చేసి తెరకెక్కించిన యశోధ చిత్రం ఎంత వసూల చేస్తుందో అనేది త్వరలోనే తెలియనుంది. 

Also Read :  NTR సలహాని పట్టించుకోని రేలంగి.. పాటించి ఉంటే మాత్రం ఈరోజు మరోలా ఉండేది..!!

Visitors Are Also Reading