Home » ఇకపై ఊరుకోను.. తప్పుడు వార్తలు తీస్తే తాట తీస్తా.. దిల్ రాజు స్ట్రాంగ్ వార్నింగ్

ఇకపై ఊరుకోను.. తప్పుడు వార్తలు తీస్తే తాట తీస్తా.. దిల్ రాజు స్ట్రాంగ్ వార్నింగ్

by Anji
Ad

సంక్రాంతి సినిమాల ఘాటు మాములుగా లేదు. బరిలోకి 5 సినిమాలు రిలీజ్ అని ముందు నుంచి అన్నారు. ఆతరువాత ఫిలిం ఛాంబర్ లో మీటింగ్ పెట్టి దిల్ రాజు ఆద్యక్తతన ఆయా నిర్మాతలను ఒప్పించి ఎట్టకేలకు ఈగల్ సినిమా వాయిదా వేశారు. ఇక.. బరిలో గుంటూరు కారం, హనుమాన్ , సైoధవ్ , నా సామిరంగా చిత్రాలు ఉన్నాయి. ఈ నాలుగు సినిమాల్లో హనుమాన్ ఒకరకంగా చిన్న సినిమానే . ఎంత ఒప్పించినా హనుమాన్ మేకర్స్ వాయిదాకు ఒప్పుకోకపోవడంతో పెద్ద సినిమాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఆ తరువాత హనుమాన్ చిత్రానికి మిగిలిన హాళ్లు కేటాయించారు. ఈ క్రమంలో దిల్ రాజుపై కొన్ని వైబ్ సైట్స్ నెగిటివ్ వార్తలు రాశాయి.

Advertisement

దీంతో దిల్ రాజు తప్పుడు వార్తలు రాసే వెబ్‌సైట్లపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా తనపై విమర్శలు చేస్తున్నారని, ఇకపై తన గురించి తప్పుడు వార్తలు రాస్తే తాటతీస్తానంటూ ఆ వెబ్‌సైట్లను ఉద్దేశించి హెచ్చరించారు. హను-మాన్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడిన మాటలను కొన్ని ప్రముఖ వెబ్‌సైట్లు తప్పుగా వక్రీకరించాయని దిల్‌రాజు మండిపడ్డారు. ” ఇండస్ట్రీలో పక్కనే ఉంటూ మనపై రాళ్లు వేస్తారు. ప్రతి సంక్రాంతికి సినిమాలు విడుదలవుతుంటాయి. కానీ సంక్రాంతి టైంలోనే నాపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏడెనమిదేండ్లుగా ఇది నడుస్తూనే ఉంది.

Advertisement

Dil Raju

చిరంజీవి మాట్లాడుతూ.. దిల్‌ రాజుకు ఏ టైంలో ఏం చేయాలో తెలుసు అని అన్నారు. కానీ కొన్ని వెబ్‌సైట్లు చిరంజీవి మాట్లాడిన దాన్ని వక్రీకరించాయి. మీరు నాపై ఏదో రాసి మీ వెబ్‌సైట్ల ఇంపార్టెన్స్‌ను పెంచుకోవడానికి వేరే వాళ్లను ఎందుకు వాడుకుంటున్నారు. మీకు ఇది అవసరమా” అని దిల్‌ రాజు ప్రశ్నించారు. దిల్‌ రాజు ఏం రియాక్ట్‌ అవడు. సాఫ్ట్‌గా వెళ్తాడనుకుంటున్నారా ? తాట తీస్తా. సాఫ్ట్‌గా ఉండాలని చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నా. ఈరోజు నుంచి ఊరుకునే ప్రసక్తే లేదు. వ్యాపార పరంగా వచ్చే కొన్ని కాంట్రవర్సరీలను మీరు అడ్వాంటేజ్‌గా తీసుకుని కొన్ని వెబ్‌సైట్లు, కొన్ని యూట్యూబ్‌ ఛాన్సల్స్‌కు వాడుకుంటున్నారు. అది తప్పు” అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading