Home » ఈ ఆహారాలు పదే పదే తింటున్నారా..? క్యాల్షియం లోపిస్తుంది జాగ్రత్త..!

ఈ ఆహారాలు పదే పదే తింటున్నారా..? క్యాల్షియం లోపిస్తుంది జాగ్రత్త..!

by Anji
Ad

సాధారణంగా  మన శరీరం మొత్తం ఆధారపడి పని చేసేది ఎముకలపైనే. ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటేనే ఏ పని అయినా త్వరగా చేయగలం. లేదంటే ఇక అంతే సంగతులు. కండరాలను రక్షణగా బాడీకి స్థిరమైన ఆకారాన్ని కల్పించేవి బోన్స్. మనం తేలికగా కదలడానికి, ఆక్టివ్ గా ఉండడానికి హెల్ప్ చేసేవి ఎముకలే. అంతేకాకుండా ఎముకల్లో ఎర్ర రక్త కణాలు అనేవి తయారవుతాయి. ఇవి రక్తం తయారీకి సహాయపడతాయి. ఇలా ఎముకలపైనే శరీరం మొత్తం ఆధారపడి ఉంటుంది. శరీరం బలంగా, దృఢంగా లేకపోతే ఎలాంటి పనులు చేయలేం. బోన్స్ స్ట్రాంగ్ ఉండేందుకు ముఖ్య కారణం కాల్షియం.

Advertisement

శరీరం దానంతట అదే క్యాల్షియం తయారు చేసుకోలేదు. ఆహారం, సప్లిమెంట్స్ ద్వారానే కాల్షియం వెళుతుంది. మనం సరిగ్గా కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోక పోతే కాల్షియం లోపం తలెత్తే అవకాశం ఉంది. ఇది ఎముకలపై బాగా ప్రభావం చూపిస్తుంది. దీంతో కీళ్ల నొప్పులు, బోన్స్ పెయిన్స్ అనేవి వస్తాయి. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే.. కాల్షియం సోషణకు అడ్డు పడతాయి. దీంతో శరీరం క్యాల్షియంను గ్రహించ లేవు. ఈ కారణంగా ఎముకలకు సంబంధించి రకరకాల ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఎముకలు స్ట్రాంగ్ గా ఉండాలంటే ప్రోటీన్ అనేది చాలా ముఖ్యం. కానీ ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఎముకలకు హాని కలుగుతుంది. ఎందుకంటే బాడీలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. కాబట్టి మీ ఆహారంలో ప్రోటీన్స్ , కాల్షియం రెండు సమపాలల్లో తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కాల్షియం లోపం తలెత్తే అవకాశం ఉంది. ఉప్పులో ఉండే సోడియం.. కాల్షియం క్షీణించేలా చేస్తుంది. దీంతో ఎముకలు గుల్ల భారీ పోయి బలహీనంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో ఉప్పు ఎక్కువగా లేకుండా చూసుకోండి.

 

బచ్చలి కూర ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ  ఇందులో ఆక్సలేట్ అనేది అధికంగా ఉంటుంది. వీటిలోనే కాకుండా బీన్స్, కొన్ని రకాల చిక్కుళ్ళు, దుంపల్లో కూడా ఆక్సలేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తక్కువ మోతాదులో తీసుకుంటేనే ఎముకలకు చాలా మంచిది. అలాగే టమాటా, వంకాయ, బంగాళ దుంపలు, పుట్ట గొడుగులు, మిరియాలు వంటివి ఎక్కువగా తీసుకుంటే బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది. సాధారణంగా ఇది కొంతమేర ఆరోగ్యం అయినప్పటికీ.. డ్రింక్స్, కాఫీ, టీలు ఎక్కువగా తీసుకుంటే మాత్రం కాల్షియం సోషణకు ఆటంకం కలుగుతుంది. దీంతో ఎముకలు బలహీనంగా మారతాయి.

 

Visitors Are Also Reading