Home » చిరంజీవి ఇంద్ర స్టోరీని తొలుత ఆ ద‌ర్శ‌కుడు రిజెక్ట్ చేశాడ‌నే విష‌యం మీకు తెలుసా..?

చిరంజీవి ఇంద్ర స్టోరీని తొలుత ఆ ద‌ర్శ‌కుడు రిజెక్ట్ చేశాడ‌నే విష‌యం మీకు తెలుసా..?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలున్నాయి. ముఖ్యంగా అలాంటి సినిమాల్లో ఇంద్ర ఒక‌టి. చిరంజీవి హీరోగా వ‌చ్చిన ఇంద్ర ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయింది. పెద్ద హిట్ అయిన ఈ సినిమా గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఈ సినిమా విడుద‌లై 25 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా ఈ సినిమా విశేషాల‌ను ర‌చ‌యిత, న‌టుడు ప‌రుచూరి గోపాల కృష్ణ అభిమానుల‌తో పంచుకున్నారు.

Advertisement

 

ఇంద్ర సినిమాకి చిన్ని కృష్ణ అందించిన క‌థ ఈ క‌థ‌కు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ రాసిన ప‌వ‌ర్ పుల్ డైలాగ్‌లు. దీనికి బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వం తొడ‌వ్వ‌డం చిరంజీవి న‌ట విశ్వ‌రూపం. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విష‌యాలు ఈ సినిమా విష‌యంలో గొప్ప‌గానే జ‌రిగాయి. అందుకే ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. తొలుత సినిమా క‌థ‌ని ద‌ర్శ‌కుడు బి.గోపాల్ వ‌ద్ద‌న్నాడట‌. అందుకు కార‌ణం స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహానాయుడు లాంటి రెండు సినిమాల్లో కూడా హీరో పాత్ర చిత్రీక‌ర‌ణ ఇంద్ర సినిమాలో ఉన్న‌ట్టే ఉంటుంది. ఈ సినిమా అదే క‌థాంశంతో తెర‌కెక్కిస్తే ప్లాఫ్ అని భ‌య‌ప‌డ్డాడు బి.గోపాల్‌.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  మంచు మనోజ్ ను మౌనిక రెడ్డి పెళ్లి చేసుకోవాలనుకోవటం వెనుక.. మామూలు స్కెచ్ లేదండోయ్..!!

ఇక ఆ స‌మ‌యంలో చిరంజీవి అద్భుత‌మైన సినిమాని మిస్ అయ్యాన‌ని ఫీల్ అయ్యాడు. ఈ విష‌యాన్ని చిరంజీవితో చెప్ప‌గా.. వాళ్లిద్ద‌రూ లేకుండానే రేపు నాకు చిన్నికృష్ణ‌తో క‌థ చెప్పండని చిరంజీవి చెప్పారు. ఇంట‌ర్వెల్ వ‌ర‌కు క‌థ చెప్ప‌గానే వెంట‌నే చిరంజీవి కిళ్లీ వేసుకొని మ‌రీ చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేద‌ని చెప్పారు. ఈ సినిమా హిట్ అవుతుంద‌ని చెప్పారు. ఇంద్ర‌లో త‌నికెళ్ల భ‌ర‌ణి పోషించిన పాత్ర ముందు నాకే వ‌చ్చింది అంటూ ప‌రుచూరి గోపాల‌కృష్ణ వెల్ల‌డించారు. డైలాగ్ రైట‌ర్ అయిన నేను మూగ పాత్ర‌లో న‌టిస్తే జ‌నాలు ఎలా స్వీక‌రిస్తారో నేను పాత్ర వ‌దులుకున్నానంటూ ప‌రుచూరి గోపాల‌కృష్ణ చెప్పుకొచ్చారు.

ఇది కూడా చ‌ద‌వండి :  మెగా ఫ్యామిలీలో ఒక‌టి కంటే ఎక్కువ సార్లు పెళ్లి చేసుకున్న వారు వీళ్లే..!

Visitors Are Also Reading