Home » మంచు మనోజ్ ను మౌనిక రెడ్డి పెళ్లి చేసుకోవాలనుకోవటం వెనుక.. మామూలు స్కెచ్ లేదండోయ్..!!

మంచు మనోజ్ ను మౌనిక రెడ్డి పెళ్లి చేసుకోవాలనుకోవటం వెనుక.. మామూలు స్కెచ్ లేదండోయ్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

గత కొన్ని రోజుల నుంచి చాలామంది జనాలు ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా వార్తలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. ఇంతకీ ఆ విషయం ఏంటని అనుకుంటున్నారు కదూ. అదే మీకు అందరికీ తెలిసిందే.. మంచు మనోజ్ మరియు భూమా మౌనిక రెడ్డి పెళ్లి విషయం.. మంచు మనోజ్ మరియు భూమా మౌనిక రెడ్డి గత కొన్ని రోజుల నుంచి కలిసి తిరగడంతో సోషల్ మీడియాలో వార్తలు అనేకం వస్తున్నాయి. దీంతో ఈ విషయాన్ని మీరు కనీసం పట్టించుకోకపోవడంతో అది నిజమే అని భావిస్తున్నారు. ఇకపోతే అఖిలప్రియ చెల్లి భూమా మౌనిక రెడ్డి త్వరలో ఆళ్లగడ్డ రాజకీయాల్లో అడుగు పెట్టనున్నారని తెలుస్తోంది.

Advertisement

also read:మళ్లీ పెళ్లికి సిద్ధమైన సమంత.. వరుడు కూడా ఫిక్స్.. అతనే అయి ఉంటాడా..?

Advertisement

మౌనిక రెడ్డికి రాజకీయాలు అంటే చాలా ఇష్టం. మంచి మాటకారి కూడా. అఖిలప్రియ కంటే చెల్లి బాగా చురుగ్గా ఉంటుందని బాగా మాట్లాడుతుందని ఆళ్లగడ్డలో ప్రచారం సాగుతోంది. హైదరాబాద్ కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ జైల్ వెళ్ళినప్పుడు ఈ మౌనిక రెడ్డి ఆళ్లగడ్డ కు వెళ్లి మా సోదరి లేకపోయినా నేనున్నానంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చింది. అక్క జైల్లో ఉన్న సమయంలోనే ఆళ్లగడ్డలో ఏ విధంగా అయిన తిష్ట వేయాలని మౌనిక ప్రయత్నాలు చేపట్టారు. కానీ వీరి మధ్య ఆస్తుల పంపకాల తగాదాలు ఉండటంతో మౌనిక ఆళ్లగడ్డ రావడానికి అఖిలప్రియ తట్టుకోలేదు. దీంతో మౌనిక ఆళ్లగడ్డ కు మరోసారి వెళ్లే ప్రయత్నాన్ని విరమించుకున్నారు. దీంతో మౌనిక రెడ్డికి కుటుంబ సభ్యుల నుంచి కూడా ఆదరణ లేకుండా పోయింది.

ఇక సమయం కోసం ఎదురుచూసిన మౌనిక రెడ్డి ఆళ్లగడ్డలో ఏ విధంగానైనా రాజకీయ ప్రవేశం చేయాలని మౌనిక ప్లాన్ వేసుకొని, మంచు మనోజ్ తో చనువుగా ఉంటూ వస్తోంది. మంచు మనోజ్ కుటుంబం గురించి అందరికీ తెలిసిందే. వీరి మధ్య ఉన్న రిలేషన్ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తన పెళ్లి మరియు రాజకీయ ప్రవేశం ఒక్కసారి జరగాలని మంచు మనోజ్ చెప్పడం వెనుక అసలు కారణం మౌనిక కోసమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎలాగైనా రాజకీయంగా మరియు వాస్తు పరంగా అక్కతో తేల్చుకోవాలనే మౌనిక ఇలా చేస్తున్నట్టు సమాచారం. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ముందు ముందు రోజుల్లో పూర్తిగా అర్థమవుతుంది.

also read:చిరు సినిమాకి పవన్ చీఫ్ గెస్ట్.. ఇక ఫ్యాన్స్ కి పండగే పండగ..!!

Visitors Are Also Reading