Home » RRR కి బదులు ఛెల్లో షో ని ఆస్కార్ కి పంపించి కేంద్రం తప్పు చేసిందా..? మరో అవార్డు గ్యారెంటీ..!

RRR కి బదులు ఛెల్లో షో ని ఆస్కార్ కి పంపించి కేంద్రం తప్పు చేసిందా..? మరో అవార్డు గ్యారెంటీ..!

by Anji
Ad

RRR Oscor: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR చిత్రం సాధించినటువంటి రికార్డులు, వసూలు చేసినటువంటి కలెక్షన్ల గురించి దాదాపు అందరికీ తెలిసిందే.

RRR Oscor

Advertisement

మార్చి 25, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. సాధారణంగా రాజమౌళి సినిమా అంటేనే హిట్ పక్కా.. అలాంటిది అతనికి తోడుగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు, ఆలియా భట్ వంటి అందాల తారతో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముందు నుంచే ప్రభంజనం సృష్టించింది. 

Also Read :  ‘నాటునాటు’ పాటను నాటుగా పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్‌ల బ్యాక్ గ్రౌండ్ ఇదే !

Manam News

ముఖ్యంగా RRR చిత్రం క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా ఈ సినిమా నుంచి నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు రావడంతో రాజమౌళితో పాటు తెలుగు వారి ఖ్యాతి ప్రపంచ వ్యాప్తం అయింది. RRR ప్రమోషన్లలో రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఎంత కష్టపడ్డారో తెలిసిందే.   ఈ సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ టీమ్ కి అభినందనలు తెలుపుతున్నారు.  ఇప్పటికే తెలంగాణకు చెందిన కొందరు మంత్రులు సౌత్ సినిమాల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని విమర్శలు కూడా చేసారు.  RRR సినిమాని కాదని గుజరాత్ కి చెందిన  ఛెల్లో షో సినిమాను ఆస్కార్ కి పంపడంతో కేంద్రం వైఖరీ ఏంటో స్పష్టమైందని పేర్కొంటున్నారు. వాస్తవానికి ఛెల్లో షోని కాదని ఆర్ఆర్ఆర్ ని ఆస్కార్ కి పంపించినట్టయితే భారత్ ఖాతాలో మరో అవార్డు చేరి ఉండేదని.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా తప్పుచేసిందని పలువురు  కామెంట్స్ చేస్తున్నారు. 

Advertisement

Also Read :   రెండో పెళ్లిచేసుకున్న సురేఖ‌వాణి…? నెట్టింట వైర‌ల్ అవుతున్న న్యూస్..!

Manam News

ఆస్కార్ అవార్డుల కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఏడాది భారత్  నుంచి వచ్చినటువంటి బెస్ట్ 14 సినిమాలను షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఆ తరువాత 16 మంది సభ్యులు ఉన్న ఇండియన్ సబ్మిషన్ ఫర్ ఆస్కార్ జ్యూరీ ఓ సినిమాను భారత్ నుంచి అధికారికంగా సెలెక్ట్ చేసి ఆస్కార్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరిలో పంపిస్తారు.   ఈ ఏడాదికి ‘ఛెల్లో షో’ ని ఎంపిక చేశారు. ఈ జాబితాలో RRR చిత్రంతో పాటు ‘కశ్మీర్ ఫైల్స్’ కూడా ఉన్నాయి. ఈ సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి.  ‘ఛెల్లో షో’ అనే ఓ సినిమా ఉన్నదనే విషయం కూడా  చాలా మందికి తెలియదు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ‘ఛెల్లో షో’  చిత్రం 2021లో విడుదలైంది.  ఈ చిత్రాన్ని 2022, 2023 రెండుసార్లు ఆస్కార్ కి షార్ట్ లిస్ట్ చేశారు. కానీ 2022 ఆస్కార్స్ కోసం ఛెల్లో షోని పక్కన పెట్టారు. ఈ ఏడాది భారత్ తరుపున ఆస్కార్ బరిలో ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరిలో నిలిపారు. ఒకే సినిమాను రెండుసార్లు షార్ట్ లిస్ట్ చేయడం పట్ల పలు విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. మొత్తానికి ఛెల్లో షో కాకుండా రాజమౌళి దర్శకత్వం వహించినటువంటి RRR చిత్రాన్ని కనుక సెలెక్ట్ చేసినట్టయితే కచ్చితంగా ఆస్కార్ అవార్డు వచ్చేదని పలువురు పేర్కొనడం గమనార్హం. 

Also Read :  మౌనికారెడ్డితో పెళ్లి త‌ర‌వాత మ‌నోజ్ జాత‌కమే మారిపోయిందా..?

Visitors Are Also Reading