ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. సోమవారం ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు ప్రకటించారు. అయితే ఆస్కార్ అవార్డు పొందిన ‘నాటు నాటు’ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ఓ రకంగా రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవల ప్రయాణం ఒకేలా మొదలైంది. రాహుల్ సామాన్య కుటుంబం నుంచి వచ్చి పేరు తెచ్చుకుంటే, కాలభైరవ సెలబ్రిటీల కుటుంబంలో పుట్టిన, సాధారణంగానే సినీ సంగీత ప్రయాణం మొదలుపెట్టారు.
Advertisement
READ ALSO : కూతురిని హెలికాప్టర్ లో అత్తారింటికి సాగనంపిన తండ్రి..వీడియో వైరల్ !
హైదరాబాదులోని మంగళ్ హాట్ అనే ఓ బస్తీలో ఓ మామూలు దిగువ మధ్యతరగతి ఇంట్లో పుట్టారు రాహుల్. స్థానిక నారాయణ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. తండ్రికి ఓ సెలూన్ షాప్ ఉంది. అదే ఆ కుటుంబానికి ఆధారం. రాహుల్ కు చిన్నప్పటి నుంచి ఆటపాటలు అంటే మక్కువ. చిన్నప్పుడు ‘మాయదారి మైసమ్మ…’ పాట పాడితే ఆ గల్లీ అంతా చెవులు రిక్కరించి మరీ వినేది. ‘కాలేజీ బుల్లోడా’ అనే పాటతో రాహుల్ టాలీవుడ్ ఎంట్రీ జరిగిపోయింది. ఎంఎం కీరవాణియే సంగీత దర్శకత్వం వహించిన ‘ఈగ’లో టైటిల్ సాంగ్, ‘దమ్ము’ చిత్రంలోని ‘వాస్తు బాగుందే’ పాట రాహుల్ కు బాగా పేరు తెచ్చి పెట్టాయి. అలా రాహుల్ కు ‘నాటు నాటు’ పాట పాడే అవకాశం వచ్చింది. కాలభైరవ ప్రయాణం మరో తరహాలో సాగింది. కీరవాణి ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు కాలభైరవ. కీరవాణి పెంపకంలో హంగు ఆర్భాటాలు లేవు. డబ్బు విలువ తన బిడ్డలకు తెలియాలన్నది ఆయన ఆలోచన.
Advertisement
read also : బుమ్రా సర్జరీ సక్సెస్..IPL లోకి ఎంట్రీ ?
అందుకే డబ్బుతో వచ్చే సౌకర్యాలకు తన పిల్లలను దూరంగా ఉంచాలని టాలీవుడ్ వర్గాలు చెబుతాయి. ప్రముఖ సంగీత దర్శకుడు కుమారుడు అయినప్పటికీ కాలభైరవ అంత తేలిగ్గా గాయకుడు అయిపోలేదు. కాలభైరవని మిగిలిన ట్రాక్ సింగర్స్ లానే కీరవాణి ట్రీట్ చేశారు. నిజానికి కాలభైరవ ద్రుష్టి పాటలు పాడడం మీద ఉండేది కాదు. తను ఓ మంచి కంపోజర్ కావాలని ఆశపడ్డాడు. డిగ్రీ పూర్తి చేసిన కాలభైరవ ప్రత్యేకంగా సంగీతం నేర్చుకోలేదు కానీ, తండ్రిని గమనిస్తూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని అడుగులేసారు. కీరవాణి తమ్ముడు కళ్యాణి మాలిక్ పనిచేసిన ఓ సీరియల్ ద్వారా కాలభైరవకు తొలి అవకాశం వచ్చింది. ‘నాన్న’ అనే ధారవాహిక కోసం తొలిసారి గొంతు విప్పారు.
Advertisement
READ ALSO : Shakib Al Hasan : అభిమానిని దారుణంగా కొట్టిన బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్