టాలీవుడ్ లోని బెస్ట్ లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో సురేఖవాణి కూడా ఒకరు. టాలీవుడ్ లో అక్క, వదిన లాంటి పాత్రల్లో నటిస్తూ సురేఖవాణి ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. సురేఖవాణి స్టార్ హీరోల సినిమాలలో ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తుంటారు. కొన్ని సినిమాలలో బ్రహ్మానందం కు భార్య పాత్రలో నటించి కామెడీని సైతం సురేఖవాణి పండించారు.
Advertisement
ఇవి కూడా చదవండి: పవిత్రాలోకేష్ పై మొదటి భర్త సంచలన వ్యాఖ్యలు..1500 కోట్లు నొక్కేసిందంటూ ఫైర్..!
కాగా సురేఖవాణి భర్త సురేష్ తేజ కూడా సినిమాల్లోనే పనిచేసేవారు.కాగా ఆయన ద్వారానే సురేఖవాణి కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే సురేఖవాణి భర్త సురేష్ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు సుప్రీత అనే కూతురు ఉన్నారు. సుప్రీత కూడా మోడలింగ్ లో రానించడంతో పాటూ సోషల్ మీడియాలో లక్షల్లో అభిమానులను సంపాదించుకున్నారు.
ఇవి కూడా చదవండి: సమంత పోస్ట్ కు స్పందించిన కోహ్లీ భార్య…ఇంట్రెస్టింగ్ రిప్లై ఇవ్వడంతో వైరల్..!
Advertisement
ఇదిలా ఉంటే సురేఖవాణి రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ గతంలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. కానీ ఆ వార్తలను సురేఖవాణి ఖండించారు. ఆ వార్తలపై సురేఖవాణి కూతురు సుప్రీత కూడా ఫైర్ అయ్యారు. అయితే ఇప్పుడు మరోసారి సురేఖవాణి పెళ్లి పై వార్తలు గుప్పుమంటున్నాయి.
ఇప్పటికే సురేఖవాణి రెండో పెళ్లి చేసుకుందని..ఓ వ్యాపారవేత్తను ఆమె వివాహం చేసుకుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా సురేఖవాణి మెడలో నల్లపూసల తాడు ఉండటంతో నిజంగానే నటి పెళ్లి చేసుకుని ఉంటుందా అని పులువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలి అంటే సురేఖవాణి స్పందించాల్సిందే.
Advertisement
also read : Samantha : రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్న సమంత… ఫోటోలు వైరల్!