టాలీవుడ్ లోని టాలెంటెడ్ హీరోలలో మంచు మనోజ్ కూడా ఒకరు. మోహన్ బాబు నటవారసుడుగా మనోజ్ టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. జుమ్మందినాదం సినిమాతో హీరోగా పరిచయమై ఆ తరవాత చాలా సినిమాల్లో నటించాడు. అయితే మనోజ్ స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు కానీ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను మనోజ్ సంపాదించుకున్నాడు. ఇక మనోజ్ మొదట ప్రణతిరెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
కానీ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తరవాత మనోజ్ డిప్రెషన్ లో సినిమాలకు కూడా దూరంగా ఉన్నారు. ఇక రీసెంట్ మనోజ్ రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దివంగత నేత భూమానాగిరెడ్డి కుమార్తె భూమా మౌనికారెడ్డిని మనోజ్ రెండో వివాహం చేసుకున్నాడు. మౌనికారెడ్డి సైతం ఎన్నికల సమయంలో తన సోదరి కోసం ప్రచారం నిర్వహించి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించారు.
ALSO READ : సీనియర్ ఎన్టీఆర్ లాంగ్ డ్రైవింగ్ చేస్తే… కుక్కలు, కోళ్లు అవుట్ అంతే…!
Advertisement
ఇక మౌనికకు మొదట బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్తతో వివాహం జరిగింది. కానీ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. వీరికి ఓ కూమారుడు కూడా ఉన్నాడు. కాగా రీసెంట్ గా మనోజ్ మౌనికారెడ్డిని వివాహం చేసుకోవడంతో పాటూ కలిసొచ్చే కాలనికి నడిసొచ్చే కొడుకు అంటూ బాబును ఎత్తకున్నాడు. దాంతో మనోజ్ వ్యక్తిత్వం పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే మౌనికారెడ్డిని పెళ్లి చేసుకోవడం వల్ల మనోజ్ జాతకం మారిపోయింది అంటూ కథనాలు వినిపిస్తున్నాయి. పెళ్లికి ముందు మనోజ్ ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు మనోజ్ వరుసపెట్టి సినిమాలను అనౌన్స్ చేయబోతున్నాడట. అదేవిధంగా మౌనికారెడ్డితో వివాహం తరవాత మనోజ్ కు ఆర్థికకష్టాలు కూడా తగ్గాయని టాక్ మొదలయ్యింది.
Advertisement
ALSO READ :‘నాటునాటు’ పాటను నాటుగా పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్‌ల బ్యాక్ గ్రౌండ్ ఇదే !