Home » సుహాసిని ఆ హీరోయిన్ పెళ్లి చెడగొట్టాలని చూసిందా ?

సుహాసిని ఆ హీరోయిన్ పెళ్లి చెడగొట్టాలని చూసిందా ?

by Anji
Ad

తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంది నటి సుహాసిని. సుహాసిని  అన్న స్టార్ హీరో అయిన కమలహాసన్. అలాగే ఈమె భర్త లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం. చిన్నప్పటి నుంచే సినిమాలపై ఇంట్రెస్ట్ ఉన్న సుహాసిని సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. సౌత్ లో ఈమె పేరున్న హీరోయిన్ గా  గుర్తింపు సంపాదించుకుంది. అయితే అలాంటి సుహాసిని మరో హీరోయిన్ పెళ్లి చెడగొట్టాలని ఎన్నో ప్లాన్ వేసిందట.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు ఆమె పెళ్లి చెడగొట్టాలని చూసింది అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్ల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. అలా సుహాసిని కి అప్పట్లో నటి సుమలత మంచి స్నేహితులు. అయితే వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉండేది. ఇక ఇద్దరి మధ్య ఉన్న స్నేహబంధం వల్ల సుమలత నటుడు అంబరీష్ ని పెళ్లి చేసుకుంటాను అనుకున్న సమయంలో సుహాసిని అడ్డుపడిందట. అంతేకాదు ఆయన పెద్ద రౌడీలా ఉంటాడు నీకు సెట్ అవ్వడు నువ్వు సాఫ్ట్ నేచర్ కలిగిన దానివి అని చెప్పింది. అయినప్పటికీ సుమలత నేను ఆయన్నే ప్రేమించాను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో నీ చావు నువ్వు చావు అని వదిలేసిందట.

అయితే వీరిద్దరి పెళ్లి అయి ఎంతో అన్యోన్యంగా ఉన్న సమయంలో ఓ రోజు బెంగళూరుకు వెళ్లిన సుహాసిని సుమలత ఇంటికి వెళ్లిందట. అయితే సుహాసిని ఇంటికి వెళ్లడంతోనే నటుడు అంబరీష్ ఏంటమ్మా నీకు నేను ఏమైనా అన్యాయం చేశానా..? ఎందుకు నా పెళ్లి చెడగొట్టాలని చూసావు? అయినా నీకు నేను రౌడీలా కనిపిస్తున్నానా అంటూ కడిగిపారేసారట. అయితే సరదాగా మాత్రమే అంబరీష్ సుహాసినిని అలా అడిగారట. ఇక ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పి నవ్వుకుంది సుహాసిని.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading