Home » ఆ హీరోయిన్ వల్ల సీనియర్ ఎన్టీఆర్ అన్ని ఇబ్బందులు పడ్డారా..?

ఆ హీరోయిన్ వల్ల సీనియర్ ఎన్టీఆర్ అన్ని ఇబ్బందులు పడ్డారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

అలనాటి మేటి నటులలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని నందమూరి నటసార్వభౌముడిగా పేరు తెచ్చుకున్న సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో సాంఘిక, పౌరాణిక సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.అలాంటి ఎన్టీఆర్ గారి సినిమాల్లో అవకాశం వస్తే ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఆ సినిమాలో నటిస్తారు. కానీ అలాంటిది ఓ హీరోయిన్ మాత్రం సీనియర్ ఎన్టీఆర్ సినిమాలో నటించాడానికి చాలా ఇబ్బందులు పెట్టిందట.

Advertisement

Also Read;ఆ హీరో మీద ఉన్న ఇష్టంతోనే ఆ పని చేశాను.. రష్మిక షాకింగ్ కామెంట్స్..!!

అంతే కాకుండా ఆమె దగ్గరికి సినిమాల కోసం వచ్చిన దర్శక నిర్మాతలను కూడా ముప్పు తిప్పలు పెడుతూ ఇబ్బందుల పాలు చేసిందంటూ ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..సీనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు పదుల కొద్ది సినిమాల్లో నటించారు. జమున, కృష్ణకుమారి,సావిత్రి, అంజలీదేవి గారు ఉన్నారు. అయితే అంజలి దేవి సీనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. వీరి జోడి కి అప్పట్లో మంచి ఆదరణ లభించింది.

Advertisement

కానీ అంజలి దేవి మాత్రం సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలకు డేట్స్ ఇవ్వకుండా దర్శకులను చాలా ఇబ్బంది పెట్టిందట. అయితే ఈ విషయం తెలిసిన సీనియర్ ఎన్టీఆర్ గారు ఎలాగైనా అంజలీదేవికి గుణపాఠం చెప్పాలని భావించి తన సినిమాల్లో అంజలీదేవికి అవకాశం ఇవ్వకుండా కొత్త హీరోయిన్లయిన దేవిక,సరోజ,కృష్ణకుమారి వంటి హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారట. ఇక ఆ టైంలో ఆ హీరోయిన్లతో ఎక్కువ సినిమాల్లో నటించి అంజలి దేవి కి మంచి గుణపాఠం చెప్పారట. అయితే ఈ విషయం తెలిససిన చాలామంది సీనియర్ ఎన్టీఆర్ గారితో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని భావించారట.

Also Read:ఏఎన్ఆర్ చివరి రోజుల్లో అందర్నీ దూరం పెట్టడానికి కారణం..?

Visitors Are Also Reading