Home » ఆ హీరో మీద ఉన్న ఇష్టంతోనే ఆ పని చేశాను.. రష్మిక షాకింగ్ కామెంట్స్..!!

ఆ హీరో మీద ఉన్న ఇష్టంతోనే ఆ పని చేశాను.. రష్మిక షాకింగ్ కామెంట్స్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

రష్మిక మందన్న.. ఈ హీరోయిన్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కన్నడ బ్యూటీ అయిన ఈ హీరోయిన్ తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఛలో సినిమా తర్వాత ఈమె రేంజ్ ఒక్కసారి గా మారిపోయింది.ఆ సినిమా తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని తెలుగులో కొద్దిరోజుల్లోనే స్టార్ హీరోయిన్ లిస్టులో చేరిపోయింది. ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా తగ్గేదెలే అన్నట్లు చాలానే డిమాండ్ చేస్తుంది. అలాంటి రష్మిక మందన్న ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాల్లో ఇరుక్కుంటుంది. ఇదిలా ఉంటే రష్మిక మందన్న ఈ మధ్యకాలంలో హీరోయిన్గా చేసిన సినిమా వారీసు.

Advertisement

also read:మ‌హేశ్ బాబు, ర‌మేష్ బాబులు సినిమాల్లోకి రావ‌డానికి ఎన్టీఆర్ సాయ‌ప‌డ్డార‌ని తెలుసా..? ఎలా అంటే…!

అయితే ఈ సినిమాలో రష్మిక మందన్న పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. అయితే ప్రాధాన్యత లేని పాత్ర ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటో తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. రష్మిక మాట్లాడుతూ.. నేను వారీసు సినిమాలో చేయడానికి గల ప్రధాన కారణం హీరో విజయ్. విజయ్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఒక్కసారైనా ఆయనతో కలిసి నటించాలని భావించాను. అందుకే వారీసు సినిమాలో నా పాత్ర అంతగా లేదు అని తెలిసినప్పటికీ నేను అందులో నటించాను. అంతేకాదు కేవలం ఆ సినిమాలో రెండు పాటల వరకు మాత్రమే నేను పరిమితమై ఉన్నాను.

Advertisement

అయితే ఈ విషయం నాకు తెలిసినా కూడా కావాలనే నేను ఈసినిమాలో ఒప్పుకున్నాను. ఎలాగైనా విజయ్ సార్ తో కలిసి ఒక్క సినిమాలోనైనా నటించాలని నా కో*క. అందుకే ఈ సినిమాలో నటించాను. అలాగే ఈ సినిమాలో జిమిక్కు పన్ను, రంజిదమే వంటి పాటల ద్వారా నాకు మంచి పేరు వచ్చింది. ఇక ఈ సినిమా లో నటించడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో రష్మిక అసలు విషయాన్నీ బయటపెట్టింది. ప్రస్తుతం రష్మిక మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మిక త్వరలోనే పుష్ప 2 సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

also read:

Visitors Are Also Reading