Home » బాహుబలి సినిమా కోసం ప్రభాస్ అలాంటి కండిషన్స్ పెట్టారా..? రాజమౌళి ఏం చెప్పారంటే..?

బాహుబలి సినిమా కోసం ప్రభాస్ అలాంటి కండిషన్స్ పెట్టారా..? రాజమౌళి ఏం చెప్పారంటే..?

by Anji
Ad

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా ఈ దర్శకుడు పేరు మారు మ్రోగిపోతుంది. RRR మూవీ విడుదలైన తరువాత ప్రపంచ వ్యాప్తంగా పరిచయమయ్యారు రాజమౌళి. ప్రధానంగా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక RRR  సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో  దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. కెరీర్ ప్రారంభంలో సీరియల్ దర్శకుడిగా పని చేశారు రాజమౌళి. ఆ తరువాత ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ 1 చిత్రానికి దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. 

Advertisement

అయితే  తొలి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రాజమౌళి.. అనంతరం తన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన  విజయాలను అందుకొని నిర్మాతలకు భారీ లాభాలను తీసుకువచ్చాయి.ఇలా ఇండస్ట్రీలో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను కూడా అందరికీ పరిచయం చేశారు. ప్రభాస్  హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చినటువంటి మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా బాహుబలి..  ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.ఈ సినిమా కోసం దర్శక నిర్మాతలు హీరోలు కూడా ఎంతో కష్టపడి పనిచేశారు అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రాజమౌళి ప్రభాస్ రానా వంటి వారికి కఠినమైనటువంటి నియమాలను పెట్టి సినిమా షూటింగ్ పూర్తి చేశారని తెలుస్తుంది.అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం రాజమౌళికి ప్రభాస్ పెట్టిన కండిషన్ గురించి ఒక వార్త వైరల్ గా మారింది. 

Bahubali part-3

Advertisement

ప్రభాస్ బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో తన శరీర బరువులో ఏ విధమైనటువంటి మార్పులు లేకుండా ఉండడం కోసం కఠినమైనటువంటి డైట్ ఫాలో కావాలని ప్రత్యేకంగా ఒక డైటీషియన్ ను జక్కన్న ఏర్పాటు చేశారట.వారు చెప్పిన విధంగానే ప్రభాస్ ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ అంటే ఎంతో ఇష్టం ఉన్నటువంటి ఈయన ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎంతో ఇబ్బంది పడ్డారని తెలుస్తుంది.అయితే బాహుబలి 2 షూటింగ్ సమయంలో మాత్రం ప్రభాస్ రాజమౌళికే కండిషన్ పెట్టారట . నేను ఈ సినిమాలో నటించాలి అంటే మీరు నేను పెట్టే కండిషన్ కి తప్పకుండా ఒప్పుకోవాలని అప్పుడే నేను ఈ సినిమా షూటింగ్ చేస్తానని ప్రభాస్ రాజమౌళికి కండిషన్ పెట్టారట. 

prabhas rajamouli

మరి ఆయన పెట్టిన ఆ కండిషన్ ఏంటి అనే విషయానికి వస్తే… నేను మీరు చెప్పిన డైట్ కేవలం షూటింగ్ సమయంలో మాత్రమే ఫాలో అవుతాను ఇతర సమయాలలో నాకు నచ్చిన విధంగా నాకు ఇష్టమైన ఫుడ్ తీసుకుంటాను అని చెప్పారట అందుకు మీరు ఒప్పుకోవాలని ఈ కండిషన్ కి ఒప్పుకుంటేనే నేను సినిమా షూటింగ్లో పాల్గొంటాను అంటూ రాజమౌళికి ప్రభాస్ కండిషన్ పెట్టారు.సాధారణంగా ప్రభాస్ మంచి ఫుడీ అనే విషయం మనకు తెలిసిందే.వివిధ రకాల ఆహార పదార్థాలతో ఎంతో ఇష్టంగా ఫుడ్ తీసుకునే ప్రభాస్ ని ఇలా కట్టడి చేయడంతో ఆయన ఫుడ్ విషయంలో రాజమౌళికి కండిషన్ పెట్టారట. ఇలా ఫుడ్ విషయంలో ప్రభాస్ పరిస్థితి గమనించిన రాజమౌళి ఆ కండిషన్ కి ఒప్పుకొని బాహుబలి 2 మూవీ షూటింగ్ పూర్తి చేశారని ఒక వార్త వైరల్ గా మారింది.

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Sree Leela : ఆ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న శ్రీలీల.. !

BJP పార్టీలోకి టాలీవుడ్ యాంకర్ అనసూయ భరద్వాజ్.. అక్కడి నుంచే పోటీ?

Visitors Are Also Reading