Home » స్టార్ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ మూవీ..!

స్టార్ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ మూవీ..!

by Sravanthi
Ad

తెలుగు ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నటనతో అందరిని ఆకట్టుకుంటున్నారు రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ మాత్రం విజయ్ దేవరకొండ కి డిజాస్టర్ ని మిగిల్చింది. ఇప్పటికే మూడు మూవీస్ కమిట్ అయిన విజయ్ దేవరకొండ ఇంకో సినిమా కూడా కమిట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈయన చేయబోయే నాలుగో సినిమా తెలుగులో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న హరీష్ శంకర్ తో ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి.

Advertisement

అర్జున్ రెడ్డి తర్వాతే వీళ్ళ కాంబినేషన్లో సినిమా రావాలి కానీ కొన్ని అనివార్య కారణాల వలన సినిమా పట్టాలెక్కలేదు. మరి ఎప్పుడు ఈ సినిమా వస్తుందనేది తెలియదు. హరీష్ శంకర్ తనదైన రీతిలో వరుస సినిమాలో చేస్తూ ముందుకు వెళ్తున్నారు. విజయ్ దేవరకొండ కి కమర్షియల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందిస్తాడా లేదా అనేది చూడాల్సి ఉంది. వీళ్ళ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి రెండేళ్ల వరకు సమయం పట్టే అవకాశం కనబడుతుంది.

Advertisement

Also read:

ఇప్పటికే విజయ్ మూడు సినిమాలకి కమిటీ అయ్యారు. కాబట్టి ఆ మూడు అయిపోయిన తర్వాత ఈ నాలుగవ సినిమా చేస్తాడా అని అంతా భావిస్తున్నారు. మూడు సినిమాలు తో విజయ్ ఎంత వరకు అలరిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. విజయ్ అభిమానుల్లో ఇప్పటికే ఈ సినిమాలపై చర్చ జరుగుతుంది. పైగా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి అటువంటి సందర్భంలో ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా విజయ్ సినిమాలు ఉంటాయా ప్రేక్షకుల్ని నిరాశపరచకుండా ఉంటాడా అనేది చూడాల్సి ఉంది.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి

Visitors Are Also Reading