Home » అమిగోస్ సినిమాతో కళ్యాణ్ రామ్ కి మరో బ్లాక్ బస్టర్ పడ్డట్టేనా ?

అమిగోస్ సినిమాతో కళ్యాణ్ రామ్ కి మరో బ్లాక్ బస్టర్ పడ్డట్టేనా ?

by Anji
Ad

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. గత ఏడాది బింబిసార చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కళ్యాణ్ రామ్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు.. తన కెరీర్ లోనే రూ.40 కోట్లకు పైగా షేర్ రాబట్టి తిరుగులేని కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఆ హిట్ టాక్ ను కళ్యాణ్ రామ్ తన తాజా సినిమాను అమిగోస్ తో కంటిన్యూ చేసాడు. ఇవాళ విడుదలైన ఈ చిత్రం అదిరిపోయే టాక్ ని సంపాదించుకుంది. నాలుగు నెలల గ్యాప్ లో కళ్యాణ్ రెండో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రానికి ముందు నుంచి అన్ని కలిసొచ్చాయి. 

Advertisement

ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ లో నటించారు. ఓ పాత్రలో నెగిటివ్ కనిపించి అదరగొట్టేశాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ బ్యానర్ నిర్మించింది. ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తవ్వడం.. అడ్వాన్స్ బుకింగ్ లు బాగుండడం ఈ సినిమాకి అన్ని కలిసొచ్చాయి. దీనికి తోడు ఈ సినిమా పాజిటివ్ టాక్ రావడం కూడా సూపర్ హిట్ అవుతుందనే చెప్పవచ్చు. మరోవైపు ఇటీవలే మైత్రీ మూవీస్ బ్యానర్ లో సంక్రాంతి పండుగకి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రం కూడా ఈ బ్యానర్ లో రావడం కొంత ప్లస్ అయింది. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకోవడంతో కళ్యాణ్ రామ్ స్క్రిప్ట్ సెలక్షన్ మరోసారి అదిరింది అని అంటున్నారు. 

Advertisement

Also Read :  Ram Charan : విజయ్ ‘లియో’లో మెగా హీరో రామ్ చరణ్… ఇదిగో ఇదే సాక్ష్యం!

Manam News

థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కింది. తెలుగు ప్రేక్షకులకు ఇది భిన్నమైన అనుభవం అని ప్రతీ ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. దర్శకుడు రాజేంద్ర రెడ్డి ట్రిపుల్ రోల్ క్యారెక్టర్స్ ని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చేశాడని జనాలు చర్చించుకుంటున్నారు.  ముఖ్యంగా బిపిన్ రాయ్ క్యారెక్టరైజేషన్ ఎంతో స్పెషల్ గా నిలిచింది. కళ్యాణ్ రామ్ తన పాత్రను చాలా ఫర్పెక్ట్ గా చేశారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఇండస్ట్రీలో నందమూరి హీరోలు వరసగా హిట్లు కొడుతున్నారు. బాలయ్య అఖండ వీరసింహారెడ్డి సినిమాలతో హిట్ కొట్టగా.. ఎన్టీఆర్ వరుసగా 6 హిట్లతో కళ్యాణ్ రామ్ బింబిసార, అమిగోస్ సినిమాతో సూపర్ హిట్ సాధించారు. 

Also Read :  రాజకీయాలకు గుడ్ బై..సినిమాల్లోకి ఏపీ మంత్రి విడదల రజిని?

Visitors Are Also Reading